• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  1977లో నీ బుద్దిని ఆయ‌న...

1977లో నీ బుద్దిని ఆయ‌న చెప్పేశాడు బాబు

By - Tupaki Desk
Update: 2017-08-15 10:58 GMT
స్వాతంత్ర దినోత్సవం రోజున ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం రోజు కూడా  కనీసం మినహాయింపు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నార‌ని విమర్శించారు. చంద్రబాబు జెండా ఆవిష్కరించిన ప్రాంగణంలో గత మూడు సంవత్సరాల క్రితం ఎన్నికల సభలో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని తుంగ‌లో తొక్కి ప్ర‌స్తుతం కొత్త రంగుల లోకం చూపిస్తున్నార‌ని భూమ‌న‌ వ్యాఖ్యానించారు.

నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌ట్టారు. కాపులను బీసీల్లో చేర్చుతానని, రైతు - డ్వాక్రా రుణమాఫీ - ఇంటికో ఉద్యోగం - లేకపోతే రూ. 2వేల భృతి - రాష్ట్ర బలహీన వర్గాలకు రూ.10 వేల కోట్లు ఏటా కేటాయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇదే ప్రాంగణంలో ఉన్న ప‌విత్ర జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి చట్టాలను పాతాలానికి తొక్కుతున్నార‌ని భూమ‌న మండిప‌డ్డారు. 600ల అబద్ధాలతో అధికారంలోకి వచ్చి చంద్రబాబు వాటిని అమలు చేయకుండా రూ. 3.5 లక్షల కోట్లు అవినీతిని పొంగిపొర్లిస్తున్నాడన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున చంద్రబాబు సంబరాలు, సత్ఫలితాలు, చేయబోయే కార్యక్రమాల గురించి చెబుతుంటే దెయ్యాలు - భూతాలు భగవద్గీత చదవినిట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

చట్టాలను చేసే గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి చట్టాలపై ఏమాత్రం గౌరవం లేకుండా చట్టాలను నిర్లజ్జగా వ్యతిరేకిస్తూ తుంగలో తొక్కుతున్నాడని భూమ‌న మండిప‌డ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 21 మందిని కొనుగోలు చేసిన వ్యక్తి వారితో రాజీనామా చేయించలేకపోయారన్నారు. చట్టాలలోని లొసుగులను వాడుకోవడానికి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడికి వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. ముందు నీ చరిత్ర ఎలాంటి తెలుసుకొని మాట్లాడాలన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత నీచాతి నీచ రాజకీయాలు చేసేన నికృష్టుడిగా చంద్రబాబు పేరుగాంచాడని విమర్శించారు. తోలుబొమ్మలతో పొగిడించుకుంటే సరిపోదని, రాజకీయాల్లో తలపండిన వాళ్లు చంద్రబాబు ఆదర్శనం అని చెప్పివుంటే బాబు సచ్చిలుడిగా ఉండేవాడన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి మాదిరిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే చట్టాలకు, చట్ట సభలకు గౌరవం ఉంటుందని భూమన అన్నారు. చంద్రబాబు పరిపాలనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని, బాబును ఇంటికి సాగనంపడానికి ప్రజలంతా సలసల మరిగే నూనెలా ఎదురుచూస్తున్నారన్నారు. త‌న‌కు తానే డబ్బాలు కొట్టుకుంటే వాస్తవం మరుగున పడిపోదని భూమ‌న ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిజంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు ఉంటే ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో ఎందుకని భూమ‌న సూటిగా ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో కనీసం రోజు 15 నుంచి 20 వేల మందిని కూలికి మాట్లాడుకొని నంద్యాలలో ప్రచారానికి తిప్పుతున్నారని భూమ‌న ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గురించి భూమ‌న కొత్త విష‌యాన్ని తెలిపారు. చంద్రబాబు ఎంత నీచమైన వ్యక్తో వీరరాఘవులు అనే రాజకీయ నేత చెప్పార‌ని భూమన గుర్తు చేశారు. ``1977లో చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. చిత్తూరు నియోజకవర్గానికి పోటీ చేసిన రాజగోపాల్‌ నాయుడు ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న వీర రాఘవులు చంద్రబాబుకు ఒక జీపు, 200 లీటర్ల పెట్రోలు ఇచ్చి ప్రచారం చేయమంటే మరుసటి రోజే వచ్చి అన్నా.. మొత్తం తిరగేశా.. పెట్రోల్‌ అయిపోయిందని చెప్పాడంట. ఈ విషయాన్ని వీరరాఘవులు స్వయంగా నాతో చెప్పారన్నారు. 200ల లీటర్ల పెట్రోలు మాకు తెలిసిన పెట్రోల్‌ బంక్‌ లో అమ్మేసి చంద్రబాబు తిరిగానని చెబితే ఆయన తిట్టాడు. చంద్రబాబు రాజకీయ ప్రారంభం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి`` అని ప్రజలకు సూచించారు. అలాంటి చంద్రబాబు రాజకీయాల్లో నాలాంటి నిప్పు లేడు, ఉప్పులేడు అని మాట్లాడుతున్నాడంటే పప్పులాంటి కొడుకును కన్న చంద్రబాబు రాజకీయాల్లో నీతి గురించి నీతి గురించి మాట్లాడడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని భూమ‌న ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనకు వచ్చే ఎన్నికల్లో శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారని భూమన ఆరోపించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లుల్లా, జలగల్లా మానవరక్తాన్ని పీడిస్తున్న నరరూప రాక్షసులే తప్ప మరొకటి కాదని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు.
Tags:    
  • Bhumana Karunakar Reddy 
  • Chandrababu Naidu 
  • Independence Day Speech 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS