• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాములోరి గుడిలో సీతమ్మ...

రాములోరి గుడిలో సీతమ్మ పుస్తె పోయిందా?

By - Tupaki Desk
Update: 2016-08-22 08:19 GMT
సంచలనంగా మారిన భద్రాద్రి ఆలయంలోని ఆభరణాల మిస్సింగ్ నిజమేనన్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాములోరి  గుడిలో ఆభరణాలు పోయాయంటూ గడిచిన మూడురోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. అందులో నిజానిజాలపై దేవాలయ అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటంతో ఈ వ్యవహారంపై సందేహాలతో కూడిన వార్తలు వస్తున్నాయి. మీడియాలో పెరిగిన వార్తల జోరుతో.. ఆలయ ఈవో స్పందించారు.

స్వామివారి ఆభరణాల లెక్కల్ని చూసి.. తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో.. ఆలయ ఈవో ప్రత్యేక అనుమతితో గుడిని మూసేసిన ఆర్చక బృందం ఆభరణాల లెక్కను  క్రాస్ చెక్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తం ఆభరణాల లెక్కలో రెండు ఆభరణాల లెక్క తేలలేదని ఈవోకు ఆర్చకులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈవో చెబుతున్న మాటలు చూస్తే..ప్రతిరోజు జరిపే నిత్య కల్యాణం సందర్భంగా సీతమ్మవారి మంగళసూత్రం.. లక్ష్మణస్వామికి కల్యాణ సమయంలో సమర్పించే బంగారు లాకెట్ మిస్ అయిందని వెల్లడించారు. అయితే.. కీలకమైన విషయం ఏమిటంటే.. గుడిలోని ఆభరణాలు పోయినట్లుగా ఆయన చెప్పటం లేదు. కనిపించటం లేదని మాత్రమే చెప్పటం గమనార్హం. ఆభరణాలు మరెక్కడైనా పెట్టారా? ఉత్సవ మూర్తులకు సమర్పించే వస్త్రాల్లో ఏమైనా ఆభరణాలు ఉండిపోయాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో మాత్రం రాములోరి గుడిలో ఆభరణాలు పోయినట్లుగా వార్తలు వస్తుంటే.. ఆర్చకులు.. అధికారులు మాత్రం మరింత జాగ్రత్తగా సరి చూసుకోవాలని చెప్పటం గమనార్హం. ఆలయ ఈవో అధికారిక ప్రకటన వెలువడితే తప్ప గుడిలో నగలు పోయినట్లుగా ధ్రువీకరించే అవకాశం లేదు. దీనికి తగ్గట్లే ఆలయ ఈవో మాట్లాడుతూ.. ఆభరణాలు ఉండాల్సిన చోటు లేవని మాత్రమే చెబుతున్నారు తప్పించి.. పోయినట్లుగా తేల్చకపోవటం గమనార్హం.
Tags:    
  • Bhadrachalam 
  • Sri Sita Rama Swamy 
  • Golden jewellery 
  • Telugu NEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS