ఆ చెరువులో కలువపువ్వుల మధ్య బీరు పుష్పాలు !

Update: 2020-12-14 07:10 GMT
సాధరణంగా ఏ చెరువులోనైనా  కూడా కాలువ పువ్వులు పూయడం అనేది సర్వ సాధారణం. ఆ చెరువులో కలువ పువ్వులు పూసిన సమయంలో అటుగా వెళ్తే , ఆ ఆనందమే వేరు. అక్కడక్కడ పల్లెటూళ్ల మధ్య మనకు ఈ తరహా అందమైన తామరపువ్వుల చెరువు కనిపించి కనువిందు చేస్తూ ఉంటుంది. దాదాపుగా ఊళ్లలో అక్కడక్కడ మనకు ఇలాంటి చెరువులు కనిపిస్తూ ఉంటాయి.

అయితే ,   మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి అందమైన కలువ పువ్వులతో నిండిన  కొలను ఉంది. అయితే అక్కడ కలువపువ్వుల మధ్య బీరు పుష్పాలు కూడా  దర్శనం ఇస్తున్నాయి. పై ఫొటోలో  చెరువులో తామరాకుల మధ్య ఎర్రని రంగులో మొగ్గల్లా కనిపిస్తునవి బీరు సీసాలు . మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామునిచెరువు ప్రాంతం. ఈ ప్రదేశం గతంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ చెరువు మందుబాబులకు అడ్డగాగా తయారైంది. దీనితో  సాయంత్రమైతే ఇక్కడ మందుబాబులు తిష్ట వేస్తున్నారు. పూటుగా తాగి మందు సీసాల్ని ఇలా చెరువులోకి విసిరేస్తున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా మద్యం సీసాలే కనిపిస్తున్నాయి. దీంతో లతామర పుష్పాలతో అందంగా ఉండే ఈ చెరువుతా ఇలా బీరు సీసాలతో నిండిపోయింది.
Tags:    

Similar News