ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు తెలివి మీరి పోతున్నారు. అమాయకపు కస్టమర్లను ఆడుకుంటున్నారు. వారి డబ్బులు కొట్టేయడానికి రోజుకో ప్లాన్ చేస్తున్నారు. సైబర్ నేరాలతో బ్యాంకులు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో వినియోగదారులను మోసం చేసేందుకు మోసగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు.
మీ ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ లు పంపుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ మెసేజ్ లు చూసి కస్టమర్లు భయపడుతుండగా.. నంబర్ బ్లాక్ కాకుండా ఉండాలనే తమకు ఫోన్ చేయాలని చెప్పి.. కస్టమర్లతో ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నారు.
దీనిద్వారా కస్టమర్ల బ్యాంక్, ఆధార్, పాన్ నంబర్లు సేకరించి ఖాతాల్లోని డబ్బు కొట్టేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి కేసులు చాలా వెలుగుచూశాయి. దీంతో పోలీసులు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.