• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ దేశంలో న్యూఇయర్ వేడుకలు...

ఆ దేశంలో న్యూఇయర్ వేడుకలు బంద్‌

By - Tupaki Desk
Update: 2016-12-21 07:10 GMT
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో న్యూఇయర్‌ ను అద్భుతరీతిలో సెలబ్రేట్‌ చేసుకుంటారు. భారత్‌ లో ఈవెంట్స్‌ తో రిసార్టులు - స్టార్‌ హోటళ్లు - పర్యాటక ప్రాంతాలు గానాబజానా - మందు - విందు - చిందుతో హోరెత్తిపోతాయి. నిన్నమొన్నటి వరకు బంగ్లాదేశ్‌ లో కూడా ఇలానే న్యూఇయర్‌ వేడుకలు జరిగేవి. అయితే ఈ ఏడాది ఇలాంటి వేడుకలను నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బంగ్లాదేశ్ హోం శాఖామంత్రి అసదుజ్జమన్‌ ఖాన్‌ కమాల్ ఆదేశాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలను నిషేధించిందని ఆ దేశం నిషేధించింది. ప్రజలు గుంపులు గుంపులుగా కలుసుకోవడం - బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఇంట్లో వేడుక నిర్వహించుకోవాలనుకుంటే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు తరువాత క్లబ్బులు - పబ్బులు మూసేయాలని - ఎటువంటి బాణాసంచా కాల్చరాదని ఆయన తెలిపారు. న్యూఇయర్‌ రోజును పురస్కరించుకుని యువత చట్టాలను అతిక్రమంచి చేయరాని పనులు చేస్తున్నారని, వాటిని నిరోధించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని బంగ్లాదేశ్ హోం శాఖామంత్రి అసదుజ్జమన్‌ ఖాన్‌ కమాల్ తెలిపారు. ఆ రోజు బంగ్లాదేశ్‌ లోని ప్రధాన పట్టణాల్లో గస్తీ పెంచుతామని ఆయన తెలిపారు. దీనిపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    
  • Bangladesh 
  • New Year Eve celebrations 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS