• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గోస్పాడులో చక్రం...

గోస్పాడులో చక్రం తిప్పుతున్న బాలినేని

By - Tupaki Desk
Update: 2017-08-15 13:41 GMT
నంద్యాల ఉపఎన్నికలో గెలుపు తమదే అని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఖరారు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న విషయంలోనూ ఏమరుపాటుగా ఉండడానికి అవకాశం ఇవ్వడం లేదు. నంద్యాల ఉపఎన్నికలో అతి కీలకమైన గోస్పాడు మండలాల పైనే రెండు పార్టీలు అధికంగా దృష్టి సారించాయి. గత ఎన్నికల సందర్భంగా వైసిపికి ఇక్కడ 757 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ మొత్తం 28,844 ఓట్లు ఉండగా చాలా కీలకంగా మారిన ఈ మండల ఓటర్ల మనోగతాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇక్కడ అత్యధిక శాతం ఓటర్లు వైసిపికి అనుకూలంగా ఉండటం టిడిపికి ఎంత మాతం రుచించడం లేదు.నేరుగా వైసిపిని ఎదురుకునే అవకాశం లేకపోవడంతో ప్రలోభాలతో అక్కడి ఓటర్లను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్న టిడిపి ఎత్తులు పారటం లేదు.

మరోవైపు ఇక్కడ మెజారిటీ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వైకాపా సీనియర్ లీడర్ మరియు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలో దించారు.ప్రచారం వచ్చే సోమవారంతో ముగుస్తుండగా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమెల్యే గా గెలిచిన అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మరీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాజకీయంగా ప్రత్యర్థుల ఎత్తులను సమర్ధవంతంగా ఎదుర్కుని పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లడంలో అపార అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి  స్వీయ పర్యవేక్షణలో అక్కడి వ్యవహారాలు అన్ని చక్కదిద్దుతున్నారు.

ఈ సారి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ రావాలని, అంత ప్రజాదరణ పార్టీకి ఉందని దానికి తగ్గట్టు బాలినేని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.

కార్యకర్తల్లో చైతన్యం నింపడంతో పాటు టిడిపి వేస్తున్న గాలాలు, ఎన్నికల కోసమే చేపడుతున్న తాత్కాలిక అభివృద్ధి గురించి ప్రజలకు విడమరిచి చెప్పి వాళ్ళను సరైన ఆలోచనా దిశగా నడిపిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారానికి చాలా మంచి స్పందన రావడం విశేషం. తన అనుచరులతో సహా అక్కడే పాగా వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి  పక్కా ప్రణాళికతో  చేపడుతున్న ప్రచారం పట్ల  పార్టీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు లాంచనమేనని, కాని తాము ఆశిస్తున్న మెజారిటీ తగ్గకుండా నంద్యాల ప్రజలు వైసిపి ఉన్నారని తెలుగు ప్రజలకు చెప్పడానికి  చేస్తున్న ప్రయత్నమేనని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు ఉన్న ప్రచారంలో పాల్గొంటున్న నాయకులు చేసిన వ్యాఖ్యలు వైకాపా మద్దతుదారులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

మొత్తానికి గోస్పాడులో బాలినేని చక్రం తిప్పుతున్నారు.
Tags:    
  • Balineni Srinivas Reddy 
  • YSRCP 
  • Gospadu 
  • TElugu NEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS