• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 1 గురించి బాబు...

నవంబర్ 1 గురించి బాబు ఆశలు...అసలు ఏం జరగనుంది...?

By - Tupaki Desk
Update: 2022-10-26 11:30 GMT
ఏపీకి రాజధానికి అమరావతికి సంబంధించిన విచారణ సుప్రీం కోర్టులో నవంబర్ 1న జరగనుంది. ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారిస్తోంది. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్  తో పాటు అమరావతి పరిరక్షణ కమిటీ, మరో ముగ్గురు వేసిన పిటిషన్ల మీద కూడా విచారణ చేస్తారు.

మరో వారం రోజూలలో అంటే నవంబర్ 8న పదవీ విరమణ చేయబోతున్న లలిత్ ఈ విచారణను చేపట్టడం ఒక విశేషం అయితే ఈ విచారణ ఒక్క రోజులో తేలిపోతుందా లేక సుదీర్ఘంగా కొనసాగుతుందా అన్నది కూడా ఆసక్తి కలిగించే అంశం. రాష్ట్ర ప్రభుత్వం స్టే ఇమ్మని కోరింది.

ఒకవేళ ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్ లోని వాదనలు చూసి కరెక్ట్ అనుకుంటే హై కోర్టు తీర్పు మీద స్టే సుప్రీ  కోర్టు ఇచ్చే అవకాశం ఉంది.  అలా కాకుండా ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కి విలువ ప్రాధాన్యత పెద్దగా లేదనిపిస్తే కొట్టేయవచ్చు. అపుడు కూడా విచారణ సత్వరమే తేలిపోతుంది. అది కాదు అనుకుంటే రెండు పక్షాల వాదనలు విని ఈ కేసులో న్యాయం ఏది అనిపిస్తే ఆ విధంగా తీర్పునకు వస్తారు.

అయితే ఇందులో ప్రభుత్వ పిటిషన్ లో వాదన పస లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఆయన తన పార్టీ సమీక్షలలో నవంబర్ 1న అమరావతి విషయం మీద విచారణ ఉందని, రాజధాని వ్యవహారం తేలిపోతుందని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే వైసీపీ వర్గాలు మాత్రం తమకు హై కోర్టు తీర్పు మీద స్టే లభిస్తుంది అని ఆశాభావంతో ఉన్నాయి అంటున్నారు. కొన్ని కీలకమైన మౌలికమైన అంశాలు రాజ్యాంగప్రమైనవి తాము లేవనెత్తాం కాబట్టి స్టే వస్తుంది అని వైసీపీ వర్గాలు ఆశపడుతున్నాయి.

ఇక ఈ కేసు విషయంలో లోతైన విచారణ జరగాలని సుప్రీం కోర్టు భావిస్తే మాత్రం తీర్పు రావడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అమరావతి విషయం నవంబర్ 1న తేలిపోతుంది అని భావిస్తున్నారనే  చర్చ సాగుతోంది. మొత్తానికి అమరావతి రాజధాని రగడకు దేశ అత్యున్నత న్యాయ స్థానం ఒక కీలకమైన తీర్పు తుది తీర్పు వెలువరిస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AndhraPradesh 
  • SupremeCourt 
  • YSRCP 
  • TDP 
  • JaganMohanReddy 
  • ChandraBabuNaidu 
  • Amaravathi 
  • LatestNews 
  • PoliticalNews 
  • TupakiNews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS