• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కత్తులతో వెంబడించి...

కత్తులతో వెంబడించి వ్యక్తి పై హత్యాయత్నం ..!

By - Tupaki Desk
Update: 2020-04-29 10:30 GMT
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో స్థానికుడి పై హత్యాయత్నం కలకలంరేపింది. కే గంగవరం మండలం మసకపల్లిలో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. వేటకొడవళ్లతో వెంటపడి నరకడంతో ఇజ్రాయిల్ కు తీవ్ర గాయాలయ్యాయి.. అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇజ్రాయిల్‌ పై హత్యాయత్నం స్థానికంగా కలకలంరేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇజ్రాయెల్‌ కు అతని స్నేహితుడు రాజు కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్‌ స్టేషన్ ‌లో కేసు గురించి మాట్లాడాలని ఏటిగట్టు వద్దకు రావాలని ఫోన్‌ చేశాడు. ఇజ్రాయెల్‌ ఏటుగట్టుపైకి వెళ్లగా అక్కడ ఉన్న రవ్వా నాగభూషణం మరో ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికినట్టు నిందుతుడు తెలిపాడు. అయితే భూషణం పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

కాగా, బాధితుడు ఇజ్రాయిల్ గతంలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ద్రాక్షారామంలో ఈ ఘటన జరిగింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ - టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పక్కనే ఉండగానే ఘటన జరిగింది. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • AP 
  • Attack on man with knives in east godavari 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS