వీడి దగ్గర పాలు కొనేవాళ్లు ఈ వీడియో చూస్తే షాక్
తాజాగా వెలుగు చూసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియో ను నిశితం గా చూస్తే.. ఇది సీసీ పుటేజ్ గా అర్థమవుతుంది. హైదరాబాద్ మహానగర శివారులోని డబీర్ పురా లోని ఒక పాల డైరీ లో చోటు చేసుకున్న ఉదంతం అంతా చూస్తే.. విడిగా పాలు కొనేటోళ్లంతా ఒక్క సారి వణికి పోవటమే కాదు.. బోలెడన్ని సందేహాల తో తల వేడెక్కి పోవటం ఖాయం.
ఇంతకీ ఈ వైరల్ వీడియో లో ఏముందన్నది చూస్తే.. డబీర్ పురా లోని జహంగీర్ డెయిరీ ఫాంలో గేదె నుంచి పాలు పితికిన సిబ్బంది ఒకరు.. కొంత మొత్తం పాలను తాగేయటం కనిపిస్తుంది. తాను తాగిన పాల మోతాదు తగ్గే అవకాశం ఉండటం తో.. ఆ పాలల్లోకి గేదెలు తాగే నీటి తొట్టె లోని నీళ్లను పాలల్లో కలపటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే అధికారులు స్పందించారు.
జహంగీర్ డెయిరీ ఫామ్ యజమాని మహ్మద్ సోహైల్ ను అదుపులోకి తీసుకున్నారు. గేదెలు తాగే నీటి తొట్టెలోని నీళ్లను పాలల్లోకి కలపటం ఒక ఎత్తు అయితే.. ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించటమా? అని అవాక్కు చెందుతున్నారు. ఇతగాడి దగ్గర పాలు కొనేటోళ్లు.. ఈ వీడియో చూస్తే.. వారి పరిస్థితి ఊహించుకుంటేనే అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.