• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వారు ఆఫీసులకి రావాల్సిన...

వారు ఆఫీసులకి రావాల్సిన అవసరంలేదు : కేంద్రం!

By - Tupaki Desk
Update: 2020-04-29 12:10 GMT
కరోనా విజృంభిస్తున్న సమయంలో కరోనా ను గుర్తించేందుకు భారత ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ ను తీసుకువచ్చింది. ఈ ఆరోగ్యసేతు యాప్ ను తక్షణమే డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌ కూడా ఈ యాప్ డౌన్‌ లోడ్ చేసుకోవాలని సూచించింది. కార్యాలయాలకు వచ్చేముందు స్టేటస్ గమనించుకోవాలని కోరింది.

యాప్‌లో సేఫ్ - లేదా లో రిస్క్ అని వస్తేనే కార్యాలయానికి బయలుదేరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యాప్ స్టేటస్ కనుక మోడరేట్ లేదా హై రిస్క్ అని చూపిస్తే కార్యాలయాలకు రావొద్దని తెలిపింది. మోడరేట్ లేదా హై రిస్క్ స్టేటస్ వచ్చిన వారంతా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండాలని కేంద్రం సూచించింది. స్టేటస్‌ లో మళ్లీ సేఫ్ లేదా లో రిస్క్ వచ్చేవరకూ కార్యాలయాలకు రావొద్దని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఆరోగ్యసేతు యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అంతేకాదు మొబైల్ డాటా ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలని సూచించింది.

ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్రం దీన్ని రూపొందించింది. ఐవోఎస్‌ తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ ‌లోడ్ చేసుకోవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే ఈ యాప్ అప్రమత్తం చేసి హెచ్చరిస్తుంది.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • India 
  • Arogya sethu app is a must for government employees 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS