ప్రభుత్వం రంగ సంస్థలు ఇక తగ్గిపోనున్నాయా..?

Update: 2021-02-09 16:30 GMT
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చిచ్చు పెట్టింది. దీనికి నిరసనగా ఏపీలో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.  కేంద్ర ప్రభుత్వం ఇలా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడంతో కార్మికులతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారంలోనే కాదు దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు తగ్గించడానికి ప్రణాళిక వేసినట్లు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీయూఎస్ ప్రైవేటీకరణ జోరందుకోనుంది.

నీతి అయోగ్ సిఫార్సు ఆధారంగా ప్రధాన మంత్రి మోడీ ప్రైవేటీకరణపై ఓ నిర్ణయానికి వచ్చారు. కరోనా కంటే ముందే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. కానీ కుదరలేదు. అయితే కరోనా మెల్లమెల్లగా తొలిగిపోతుండడంతో పీయూఎస్ లను ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేశారు. తాజా బడ్జెట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో మోడీ తన వ్యూహంలో భాగంగానే ఇలా చేశారని కొందరు అంటున్నారు.

ప్రభుత్వం రంగ సంస్థలైనీ కొన్నింటిని విభజించి వాటిని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లనున్నారు. వాటిలో రవాణా రంగం, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఖనిజాలు ఉన్నాయి. ఈ రంగాల్లోని సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లేదా పూర్తిగా నష్టాలుంటే వాటిని మూసేయడం లాంటి చర్యలు చేపట్టనున్నారు. మొత్తంగా ఆయా రంగాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచి అభివ్రుద్ధి చేయడం వంటివి చేయనున్నారు.

ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో మొదటగా ఎల్ఐసీ అనుంబంధ బ్యాంకుగా ఉన్న ఐడీబీఐ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ వంటివి కూడా ప్రైవేట్ పరం చేయనున్నారు.
Tags:    

Similar News