ముకేశ్ అంబానీలో అరబిక్ రక్తం.. జస్టిఫికేషన్ ఇదే
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జియోను స్టార్ట్ చేసిన వేళా విశేషం ఏమో కానీ.. దాని పుణ్యమా అని రిలయన్స్ గ్రూపు సుడి తిరిగిపోయింది. జియోకు ముందు వరకు చేసిన వ్యాపారాలకు భిన్నమైన ఫ్లాట్ ఫాంలో తన సత్తాను ప్రదర్శించిన రిలయన్స్.. దాని పుణ్యమా అని ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ స్థానానికి తీసుకెళ్లేలా చేసింది. అంతేనా.. ఫేస్ బుక్.. గూగుల్ లాంటి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి.
అలాంటి ముకేశ్ అంబానీ.. తాను మాట్లాడే సందర్భంలో ఎప్పుడు ఎవరికి చిక్కేలా మాట్లాడరు. సూటిగా విషయాల్ని చెప్పేస్తారే కానీ.. పర్సనల్ ఎమోషనల్ టచ్ ఇవ్వటం చాలా తక్కువగా చేస్తుంటారు. అలాంటి ఆయన నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్య వింటే అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా ఖతార్ ఎకనామిక్ ఫోరంను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ప్రసంగించారు.
ప్రజల మధ్య పెరిగిపోతున్న డిజిటల్ అంతరాలపై ఆందోళన వ్యక్తంచేసిన ఆయన.. వివిధ దేశాల మధ్యే కాదు.. ఒకే దేశంలోని ప్రజల మధ్యా విభేదాలు పెరిగిపోతున్నట్లు వెల్లడించారు. ఈ గ్యాప్ ను పూడించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు.. తనలో అరబిక్ బ్లడ్ ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదెలా అన్న విషయాన్ని ఆయన వివరంగా చెప్పుకొచ్చారు.
రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ యుక్తవయసులో ఉద్యోగం కోసం యెమెన్ రావటం.. ఆ సమయంలోనే తాను యెమన్ లోనే పుట్టినట్లు ధీరూభాయ్ అంబానీ చెప్పారు. 'నాలోనూ అరబిక్ రక్తమే ఉంది. అరబ్ దేశాలతో భారత్ కు శతాబ్దాలుగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఖతార్ లో సుమారు ఏడు లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారంతా భారత్ లో ఖతార్ కు అధికార ప్రతినిధులు'' అని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత తెలిసి వచ్చిందని.. వర్కు ఫ్రం హోం మొదలుకొని.. పిల్లలు ఇంటి నుంచే ఆన్ లైన్ లో చదువుకోవటం లాంటివి చేస్తున్నారన్నారు. అందరికి వ్యాక్సిన్లు అందించే విషయంలోనూ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉపయోగంగా మారినట్లుగా చెప్పారు.