• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇడ్లీ, దోశల్లా నకిలీ...

ఇడ్లీ, దోశల్లా నకిలీ సర్టిఫికెట్లు అమ్మేశారు.. వీళ్ల దందా మాములుగా లేదు!

By - Tupaki Desk
Update: 2020-09-15 02:30 GMT
మీకు బీటెక్​ సర్టిఫికెట్​ కావాలా.. లేక అగ్రికల్చర్​ డిప్లమానా.. ల్యాబ్​టెక్నిషిన్​ది అయినా ఇచ్చేస్తాం.. ఏళ్లకెళ్ళు కష్టపడి చదవాల్సిన అవసరం లేదు.. నిమిషాల్లో సర్టిఫికెట్​ మీ ముందు ఉంటుంది. ఇంతవరకు వేలల్లో సర్టిఫికెట్లు జారీచేశాం. ఎవ్వరూ గుర్తించలేదు. కాకపోతే ప్రతి సర్టిఫికెట్​కు ఓ రేటుంది’ ఆంధ్రప్రదేశ్​లో ఓ ముఠా భాగోతమిది.. ఫేక్​సర్టిఫికెట్లను సృష్టిస్తూ విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా నెల్లూరు కేంద్రం ఓ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. జేఎన్​టీసీ (జవహర్​లాల్​ నెహ్రూ టెక్నికల్​ యూనివర్సిటీ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఫేక్​ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సంస్థ చేసిన అక్రమాలపై దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్​లోని 11 జిల్లాల్లో వీళ్లు బ్రాంచీలను ఓపెన్​ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారంటే రాకెట్​ ఎంత పెద్దదో ఆలోచించవచ్చు.

దందా సాగుతున్న తీరు ఇది..
నెల్లూరుకు చెందిన జంపని వెంకటేశ్వర్లు(49),సిలారపు బాల శ్రీనివాసరావు(53),సిలారపు సుజాత(47),సిద్ది శ్రీనివాసరెడ్డి(25),కోడూరి ప్రదీప్ కుమార్(32),అనపర్తి క్రిస్టఫర్(47),బట్ట పోతుల వెంకటేశ్వరరావు(48) ముఠాగా ఏర్పడి ఈ దందాను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాకేంద్రాల్లో కంప్యూటర్​ ఇన్​స్టిట్యూట్​ పేరుతో దుకాణాలను తెరుస్తారు. అనంతరం ఏజెంట్ల ద్వారా జనాలను ఆకర్షించి డబ్బులు గుంజి సర్టిఫికెట్లు జారీచేస్తారు. ముఠా సభ్యులపై ఐపీసీ సెక్షన్లు 420,468,471ల కింద ఫోర్జరీ చీటింగ్,ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాదాపు ఈ ముఠా 2400 నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ముఠా విస్తరించింది. అయితే ఏపీలోనే 1900 సర్టిఫికెట్లు జారీచేయడం గమనార్హం.

గుట్టు రట్టయిందిలా..
ఇటీవల వ్యవసాయాధికారులు ఓ ఫర్టిలైజర్​ దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడి యజమాని వారికి తన అగ్రికల్చర్​ డిప్లొమో సర్టిఫికెట్​ ఇదేనంటూ ఓ సర్టిఫికెట్​ చూపించాడు. అధికారులు దాన్ని పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూపీ లాగడంతో ఈ దందా మొత్తం బయటపడింది. ఈ ముఠా సర్టిఫికెట్ల కోసం రూ. రెండువేల నుంచి రూ.8000 తీసుకుంటున్నట్టు విచారణలో తేలింది. ఈ కేసును సిట్​ దర్యాప్తునకు అప్పగించనున్నట్టు సమాచారం.
Tags:    
  • AP 
  • Nellore 
  • Fake Certificates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS