• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పంచాయతీలలో వైసీపీ...

పంచాయతీలలో వైసీపీ గెలిచింది ఇంత తక్కువనా? అది ఎలా?

By - Tupaki Desk
Update: 2021-03-09 07:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు కాకరేపాయి. అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.. అయితే పార్టీల గుర్తు కాకపోవడంతో ఎవరు ఎన్ని గెలిచారన్నది చెప్పడం కష్టమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ ఉందని, అందుకే తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని వైసీపీ నాయకులు అంటున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ అధికారంలో లేకున్నా చాలా చోట్ల జెండా ఎగురవేసిందని, దీంతో జగన్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని అంటున్నారు. ఇక బీజేపీ, జనసేనలు సైతం తమ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయని చెబుతున్నాయి. అయితే వైసీపీలో కేవలం 25 శాతం మంది మాత్రమే నిజంగా గెలిచిన వారున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు సన్నిహితుల వద్ద కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనవు. పోటీలో నిలబడే అభ్యర్థలకు మద్దతు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో  అధికార వైసీపీ ఆయా గ్రామాలను ఏకగ్రీవాలు చేసేందుకు యత్నించింది. కానీ కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుండా బరిలో నిలబడ్డారు. దీంతో పోటీ అనివార్యమై ఎన్నికలు జరిగాయి. మరోవైపు ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేయడంతో ఆయా గ్రామాల్లో పోటీకే సై అన్నారు.

  పంచాయతీ ఎన్నికల్లో వైపీపీకి పట్టున్న కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కేవలం 25 శాతం మాత్రమే పార్టీ మద్దతు దారులు గెలిచారని సమాచారం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆయా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంటే గిట్టని వాళ్లు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పార్టీ కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న వారికి టికెట్లు దక్కకపోవడంతో వారంతా తమ దగ్గరి వ్యక్తులకు మద్దతు ఇచ్చారు. ఇక చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.

ఆ నాలుగు జిల్లాల్లో చాలా వరకు వైసీపీ రెబల్ గా ఉన్నవాళ్లే గెలిచారు. అయితే వారు గెలిచిన తరువాత అభ్యర్థులను పిలిపించుకొని వారికి వైసీపీ కండువాలు వేసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను అధిష్టానానికి పంపి తమ అభ్యర్థులే గెలిచారని డబ్బా కొట్టుకున్నారని ఓ రెబల్ అభ్యర్థి బాహటంగానే చెప్పారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ 25 శాతం మాత్రమే గెలిచిందని, మిగతా వారంతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారేనని అనుకుంటున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు వాపోతున్నారు.
Tags:    
  • AP Panchayat 
  • Elections Results 
  • Ysrcp 
  • Ysrcp Rebels 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS