రమణ దీక్షితులను జైల్లో పెడతానని బెదిరించిన ఏపీ మంత్రి

Update: 2018-05-26 17:05 GMT
తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక వారు సంయమనం కోల్పోతున్నారు. ఆరోపణలు తప్పు అని రుజువు చేయాల్సింది పోయి బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి - టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తన నోటికి పనిచెప్పారు. రమణ దీక్షితులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూనూ రమణ దీక్షితులను బెదిరించే వ్యాఖ్యలు చేశారు.
    
అక్కడ ఏం జరుగుతోందో అన్నీ బటయకు రావాలంటే ఆయన్ను నాలుగు తన్ని బొక్కలో వేయాలి.. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. బీజేపీ నేతలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు, కుట్రలను ఎండగడతామని అన్నారు. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు కూడా రమణ దీక్షితుల ఆరోపణలపై మండిపడ్డారు.
    
రాజకీయ కారణాలతోనే రమణ దీక్షితులు అలా మాట్లాడుతున్నారని, టీటీడీలో పగడ్బందీ వ్యవస్థ ఉంటుందని, ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదని చెప్పుకొచ్చారు. టీటీడీలో అంతా ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతోందని, మరోవైపు 72 ఏళ్ల రమణ దీక్షితులు ఇప్పటికే టీటీడీ సహకారంతో ఏడేళ్ల పదవీవిరమణ పొడిగింపు పొందారని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Tags:    

Similar News