• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పరీక్షలపై ఏపీ హైకోర్టు...

పరీక్షలపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం.. సర్కారు నిర్ణయేంటి?

By - Tupaki Desk
Update: 2021-04-30 09:30 GMT
కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారమే మరో మూడు నెలలు పడుతుందన్న మాట వినిపిస్తోంది. అందులో నిజం ఎంతన్నది కాలమే బదులివ్వాలి. ఇదిలా ఉంటే.. ఏపీలోని జగన్ సర్కారు మాత్రం.. పది.. ఇంటర్ చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పటం.. దీనిపై ఏపీ సీఎం జగన్ సైతం తన వాదనను వినిపించటం తెలిసిందే. పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ అయితే.. వారి సర్టిఫికేట్ల మీద ‘‘పాస్’’ అన్న మాటే ఉంటుందని.. దీని కారణంగా మంచి కాలేజీల్లో ఆడ్మిషన్లు రావని చెప్పటం తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే విపక్షం తప్పుపడుతోంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఏ మాత్రం సాధ్యం కాదని చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది.  ఇలాంటివేళ.. పరీక్షల నిర్వహణ సరికాదంటూ ఒక వ్యాజ్యం ఏపీ హైకోర్టు ముందుకు వెళ్లింది. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పది.. ఇంటర్ పరీక్షలు అంటే.. ముప్ఫై లక్షల మంది విద్యార్థులు.. ఉపాధ్యాయులు భాగస్వామ్యం అవుతారని.. అలాంటప్పుడు కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించింది. అంతేకాదు.. సీబీఎస్ఈ.. ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షల్ని రద్దు చేసింది కదా అని హైకోర్టు గుర్తు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్న హైకోర్టు.. ఈ అంశంపై మే మూడున ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.

కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. కరోనాతో ఉన్న విద్యార్థుల మానసిక పరిస్థితేంటి? వారు రాయగలుగుతారా? అని ప్రశ్నించటం గమనార్హం. పరీక్షలు రద్దు చేయటం సులువని.. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించటం కష్టమని గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అంశంపై పునరాలోచన చేయాలని హైకోర్టు పేర్కొంది. మరీ అంశంపై జగన్ సర్కారు ఏ తీరులో రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    
  • ap high court 
  • Andhra Pradesh 
  • govermap high court 
  • Andhra Pradesh 
  • govermentent 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS