బాబు చేసిన తప్పును సరి చేస్తూ.. జగన్ సర్కారు కీలక నిర్ణయం
తెలివితేటలకు.. విజన్ కు కేరాఫ్ అడ్రస్ గా టీడీపీ అధినేత చంద్రబాబును పలువురు అభివర్ణిస్తుంటారు. నిజంగానే ఆయన నిర్ణయాల్లో అంతటి విజన్ ఉంటుందా? అంటే.. ప్రశ్నార్థకమే. ప్రజల ఆశల్ని.. ఆకాంక్షల్ని.. భావోద్వేగాల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు తోచినట్లుగా నిర్ణయం తీసుకునే వైఖరి ఆయన సొంతం. ప్రపంచంలో మరెక్కడా లేనట్లుగా.. వేదనను.. వేడుకగా నిర్వహించటం బాబుకు మాత్రమే సాధ్యమైంది. అంతేకాదు.. మూలాల్ని మర్చిపోయేలా నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఆయన తర్వాతే ఎవరైనా.
నవంబరు ఒకటో తేదీ అన్నంతనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా గుర్తుకు వస్తుంది తెలుగు ప్రజలకు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి.. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తేదీగా నవంబరు ఒకటిని ఎన్నో ఏళ్లుగా నిర్వహించటం గతం. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత నుంచి నవంబరు ఒకటో తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించటమే కాదు.. తర్వాతి రోజుల్లో హైదరాబాద్ స్టేట్ ఏపీలో కలిసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మారిన తర్వాత కూడా నంబరున ఒకటో తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగానే నిర్వహించేవారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందో.. అప్పటి నుంచి రాష్ట్ర విభజన జరిగిన జులై 2ను అపాయింటెడ్ గా వ్యవహరించటం మొదలు పెట్టారు. ఆ రోజును నవనిర్మాణ దీక్ష.. మహాసంకల్ప దీక్ష పేరుతో అర్థం లేని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ ఉనికికి కీలకమైన ఆవతరణ దినోత్సవాన్ని వదిలేసిన వైనాన్ని అప్పట్లో ప్రశ్నించినా.. బాబు సర్కారు ఏ మాత్రం పట్టలేదు. ఒక రాష్ట్రానికి.. ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నది లేకుండా చేయటం బాబుకే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని.. ఏపీకి లింకు పెట్టటంలో లాజిక్ఏమిటో అర్థం కానిది.
బాబు మర్చిపోయిన విషయం ఏమంటే.. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన నవంబరు 1ను రాష్ట్ర అవతరణగా నిర్ణయించటమే కాదు.. తెలంగాణ ప్రాంతం వచ్చి రాష్ట్రంలో కలిసిన తర్వాత కూడా నవంబరు ఒకటినే ఆవతరణ తేదీని కొనసాగించారు. ఈ లెక్కన చూసినప్పుడు.. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత.. తన అవతరణ దినోత్సవాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏపీకి లేదు.
అయినప్పటికీ బాబు మాత్రం.. ఏపీ ప్రజల ఆకాంక్షకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని వదిలేసి.. విభజన జరిగిన జూన్ 2ను నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్వహించే కార్యక్రమాన్ని పలువురు తప్పు పట్టేవారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. ఏపీప్రజలు నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్వహించే కార్యక్రమాలు ఏపీ ప్రజలకు ఇబ్బందిగా ఉండేవి. పలువురు లేవనెత్తిన వాదనల్ని నాటి బాబు సర్కారు పట్టించుకోలేదు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో బాబు సర్కారు చేసిన తప్పుల్ని.. సరి చేసింది జగన్ ప్రభుత్వం. ఇప్పటివరకు ఏపీ రాష్ట్రానికి లేని ఆవతరణ దినోత్సవాన్ని తాజాగా డిసైడ్ చేశారు. ఏపీ ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ.. తాజాగా నవంబరు ఒకటో తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్ణయిస్తూ జీవోను జారీ చేశారు. ఈ తేదీన అవిర్భావ వేడుకను నిర్వహించేందుకు కమిటీ వేసిన జగన్ సర్కారు.. దానికి ఛైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు జీవీడీ క్రిష్ణమోహన్ ను ఎంపిక చేశారు. మొత్తానికి బాబు చేసిన తప్పును జగన్ సరి చేయటమే కాదు.. ఏపీ ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నారని చెప్పక తప్పదు.