• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఓడను భారీ రేటుకు...

ఆ ఓడను భారీ రేటుకు కొనబోతున్న జగన్ సర్కార్

By - Tupaki Desk
Update: 2020-12-18 17:30 GMT
ఏపీలో కొలువుదీరిన జగన్ సర్కార్ ప్రతీదాన్ని క్యాష్ చేసుకుంటోంది. ప్రజలకు సంక్షేమం అందించడంతోపాటు అలాగే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తీర ప్రాంత నగరమైన విశాఖకు మరిన్ని సొబుగులు అద్దాలని నిర్ణయించింది. అందుకు గల ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు.

ఇటీవల విశాఖపట్నానికి బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఓడ కొట్టుకొచ్చింది. ఇటీవల వచ్చిన తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు బంగ్లాదేశ్ కు చెందిన వాణిజ్య నౌక ‘ఎంవీ మా’ విశాఖ ఔటర్ హార్బర్ నుంచి నాలుగు నాటికల్ మైళ్లు ప్రయాణించి విశాఖపట్నంలోని తెన్నీటి పార్క్ వద్ద తీరానికి కొట్టుకొచ్చింది.

అయితే దాన్ని తిరిగి బంగ్లాదేశ్ జలల్లోకి తరలించేందుకు భారీ మొత్తంలో ఖర్చు కానుంది. దీంతో ఆ తీరంలోనే దాన్ని యజమాని వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసి టూరిస్టులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని భావిస్తోంది. ఏకంగా రూ.10 కోట్లతో ఈ ఓడను కొనాలని నిర్ణయించింది. అనంతరం ఈ ఓడను రెస్టారెంట్ గా మార్చాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

ఈ మేరకు సచివాలయంలో ఏపీ టూరిజం అధికారులతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమై చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ ఓడ యజమానితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఓడను కొని పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు చేపట్టి రెస్టారెంట్ గా మార్చేలా అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.
Tags:    
  • AP Government 
  • Vizag 
  • MV Maa Ship 
  • Bangladesh 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS