• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: ఏపీ కేబినెట్...

బ్రేకింగ్: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివీ

By - Tupaki Desk
Update: 2020-11-05 14:50 GMT
ఏపీ కేబినెట్ సుధీర్ఘంగా సమావేశమైంది. కరోనా లాక్ డౌన్ నుంచి మొక్కుబడిగా సాగిన మీటింగ్ లతో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయింది. తాజాగా సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ మంత్రులంతా సమావేశమయ్యారు. ఈ కేబినెట్ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తాజాగా మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు.

కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు కేబినెట్ ఇవాళ ఆమోదించింది. సీఎం జగన్ ఇసుక పాలసీపై గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ సిఫారసులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని ఇసుక రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సిఫారసులు చేసింది. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక రీచులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు ముందుకు రాకపోవడంతో పేరొందిన సంస్థలకు ఇసుక రీచులను అప్పగించాలని నిర్ణయించారు. ఓపెన్ టెండర్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇసుక తవ్వకాలు, సరఫరాను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.వరదలు భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై రూపొందిన అంచనాలను కేబినెట్ లో చర్చించారు. సుమారు 10వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనావేసింది. కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

అవుట్ సోర్సింగ్ ద్వారా డెప్యూటేషన్ పై ఎస్ఈబీ పోస్టులను ఏర్పాటు చేసి ఏపీలో గ్యాంబ్లింగ్, బెట్టింగ్, డ్రగ్స్ ను కట్టడి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ‘జగనన్న తోడు’ పేరుతో చిరు వ్యాపారులకు రూ.10వేల రుణం ఇవ్వాలని నిర్ణయించారు. 9 లక్షలకు పైగా చిరు వ్యాపారులకు దరఖాస్తులు చేసుకున్నారు. నవంబర్ 24న జగనన్న తోడు పథకం ప్రారంభం. సుమారు రూ.1000 కోట్లు కేటాయింపు.

ఏపీలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు.. మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు. అక్వా కల్చర్ సీడ్ యాక్ట్ 2020కు కేబినెట్ ఆమోదం.

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వేకు నిర్ణయం. ఇక రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలకు భూముల కేటాయింపు.వైద్యారోగ్య శాఖలోని టీచింగ్ స్టాఫుకు యూజీసీ స్కేల్ అమలుకు నిర్ణయం.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నవంబర్ 17న ప్రారంభం. గత ప్రభుత్వంలోని సున్నా వడ్డీ బకాయిలు రూ. 1051 కోట్లు ఇవ్వనున్నాం. అక్టోబర్ పంట నష్టం పదో తేదీన ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఈ నెలాఖరులోగానే ఇన్ పుట్ సబ్సిడీని అందించనున్నాం.

ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి. వారి విడుదలకు కెబినెట్ ఆమోదం. ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోరాలని కెబినెట్లో నిర్ణయం.

విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం.150 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం.గత చంద్రబాబు ప్రభుత్వంలోనే దీనికి 500 ఎకరాలు కేటాయించారు.
Tags:    
  • AP Government 
  • Jagan 
  • Ministers 
  • Cabinet Meeting 
  • Key Decisions 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS