ఉద్యోగులు అడగకనే సీఎం జగన్ ఇచ్చిన వరం శాపం కానుందా?
కోరికను తీర్చాలంటూ తపస్సు చేస్తే.. ప్రత్యక్షమై వరం ఇచ్చేటోడ్ని దేవుడిగా కీర్తిస్తుంటాం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. మరి.. అడగకుండానే.. ఆ మాటకు వస్తే కోరుకోకుండానే.. తీసుకోండని వరం ఇస్తే వాళ్లను ఏమనాలి? ఏలా చూడాలన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. అడిగి గీ పెట్టినా ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన 40శాతం పీఆర్సీని ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నారు. అందుకు బోలెడన్ని కారాణాల్ని చెబుతున్నారు. వాటిని కాసేపు పక్కన పెట్టేద్దాం.
ఎవరూ.. ఏ మాత్రం ఊహించని రీతిలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును రెండేళ్ల పాటు పెంచేస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. కోరుకోకుండానే.. ఇంత భారీ వరం ఇవ్వటంపై ఉద్యోగులు కొందరు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా కొందరు ఉద్యోగులు మాత్రం.. సీఎం జగన్ రిటైర్మెంట్ పరిమితిని పెంచటంపై ఆనందానికి గురవుతున్న తీరు చూసి.. నిస్తేజంతో నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. జరగబోయేది తమకుబాగా తెలుసన్నది వారి మాట. అదేమంటే..
పదవీ విరమణవయసును ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న దానికి భిన్నంగా ప్రకటిస్తే.. దాని మీద కోర్టుకు వెళ్లటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును.. ఆ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచుతూనిర్ణయం తీసుకోవటం.. దీనిపై నిరుద్యోగులు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పురాలేదు. దాని కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకోవటంతో.. ఇప్పటివరకు 60 ఏళ్లకు పదవీ విమరణ కాస్తా 62 ఏళ్లకు పెరగనుంది. దీనిపై ఇప్పటికే ఏపీలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగులకు మరో రెండేళ్ల వరకు జాబ్ కు ఎలాంటి ఢోకా లేనట్లే. అయితే.. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లుగా.. సీఎం జగన్ సర్కారు చేసిన ప్రకటన ప్రకారం చూస్తే.. ఉద్యోగాలు మరో 2 ఏళ్ల వరకు పొడిగిస్తారు. దీని వల్ల సీనియర్ ఉద్యోగులకు మేలు జరుగుతుంది. నిజానికి దీని కారణంగా.. నిరుద్యోగ యువకుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దాన్ని ఏదోలా సర్దుబాటు చేద్దామనుకున్నా.. పెంచిన పదవీవరణ వయసుపై హైకోర్టుకు వెళ్లనున్న పిటీషనర్ల వాదనకు న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించి.. ప్రభుత్వం పెంచిన వయసును తగ్గించి.. పాత పద్దతిలోనే వెళ్లమంటే.. అప్పుడు ప్రభుత్వానికి రెండు వైపులా నష్టమవుతుంది. అదెలానంటే పెరిగిన పదవీ విరమణ తాయిలం పని చేయలేదని సీనియర్ ఉద్యోగులు భావించి.. జగన్ తీరుపై వ్యతిరేకతను పెంచుకోవచ్చు.అదే సమయంలో.. నిరుద్యోగులు న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగానే కొలువలు వచ్చాయే అనుందాం. అప్పుడు కూడా తమ ఉద్యోగాలకు జగన్ కారణం కాదని.. కోర్టు అని మాత్రమే నమ్ముతారు. ఇలా ఏ యాంగిల్ లో చూసినా.. ఉద్యోగులు కోరుకోకుండానే.. వరం ఇచ్చిన జగన్ ఫ్యూచర్ లోమరిన్ని కష్టాలు తప్పవని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.