• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ధర్మపోరాట దీక్షకు రెడీ...

ధర్మపోరాట దీక్షకు రెడీ అవుతున్న ఏపీ భవన్

By - Tupaki Desk
Update: 2019-02-09 17:08 GMT
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 11న దిల్లీ చేపట్టబోతున్న ధర్మ పోరాట దీక్షకు అక్కడి ఏపీ భవన్‌ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చేపట్టనున్న ఈ దీక్ష కోసం ఏపీ భవన్ ప్రాంగంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి అధికారులతో పాటు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు - స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
   
దీక్షలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా సకల ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  భవన్ అధికారులు, సిబ్బందికి విశదీకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టనున్న ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయడానికి అక్కడ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
   
దీక్ష ప్రధాన వేదిక వద్ద అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్, ప్రసారమాధ్యమాల ద్వార ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు వంటివన్నీ సిద్శమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రం నుంచి తరలివస్తున్న వారికి హోటల్స, ఇతర భవనాలలో ఏర్పాట్లు చేసే బాధ్యతలను ఒక బృందం చూపుకుంటోంది.
   
కాగా చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రికే దిల్లీ చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15 నిముషాలకు దిల్లీ విమానాశ్రయానికి వస్తారు. ఏపీ భవన్‌ లో రాత్రి బస చేసి 11వ తేది సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్సించి నివాళులు అర్పిస్తారు.  అనంతరం ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు చేరుకొని అంబెడ్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి అంజలి ఘటించి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట దీక్ష ప్రారంభిస్తారు.
   
అనంతరం.. 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12.30కి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనలో రాష్ట్రానికి  జరిగిన అన్యాయాన్ని వివరించి - కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతారు.
Tags:    
  • AP Bawan 
  • Chandrababu naidu 
  • Dharma Porata Deeksha 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS