డోనాల్డ్ ట్రంప్ కి విడాకులు ఇస్తున్న భార్య?

Update: 2020-11-09 11:30 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కు వెటనే మరో షాక్ తగలబోతోందా ? అవుననే అంటోంది బ్రిటీష్ ట్యాబ్లాయిడ్ డెయిల్ మెయిల్ ప్రకటించింది. ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంపుకు విడాకులు ఇచ్చేయాలని భార్య మెలానియా నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని డెయిలీ మెయిల్ ట్యాబ్లాయిడ్ తో ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పటం సంచలనంగా మారింది. అంటే అధ్యక్షునిగా ఓడిపోయినందుకు మెలానియా విడాకులు ఇవ్వటం లేదులేండి.

ట్రంపుకు తన భార్య మెలానియాతో ఎప్పటి నుండో గొడవలున్నాయట. దాదాపు 15 ఏళ్ళుగా వాళ్ళ మధ్య సంబంధాలు సరిగా లేవట. అయితే అధ్యక్షునిగా ఉన్న సమయంలో విడాకులు ఇస్తే బావోదని మెలానియా నాలుగేళ్ళు ఓపికపట్టిందని ఒమరోసా స్పష్టం చేశారు. విడాకులు తీసుకుందామని మెలానియా ఎప్పటికప్పుడు అనుకుంటున్నా ఏదో కారణాల వల్ల ఆ వ్యవహారం ఆలస్యమవుతోందట.

ఇపుడెలాగు ట్రంప్ అధ్యక్షుడు కాదు. మునుపటి లాగ బిజీగా ఉండే అవకాశాలు కూడా లేవు కాబట్టే మెలానియా మళ్ళీ విడాకులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒమరోసా చెప్పారు.  మరి వీళ్ళమధ్య ఉన్న గొడవలు సంగతి పక్కనపెట్టేస్తే మెలానియాకు కూతురు ఇవాంకాకు ఏమాత్రం పడటం లేదని ఇప్పటికే అనేక కథనాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.   అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మొత్తం వైట్ హౌస్ వ్యవహారాలు, ట్రంప్ పర్యటనలు మొత్తాన్ని ఇవాంకానే పర్యవేక్షించేవారన్న వార్తలు అందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగానే వైట్ హౌస్ కు మారిపోతే భార్య మెలానియా మాత్రం ఆరు మాసాల తర్వాత కానీ రాని విషయాన్ని ఒమరోసా గుర్తుచేశారట. విడాకులు తీసుకునే సమయంలో తనతో పాటు కొడుక్కి రావాల్సిన ఆస్తుల విషయంలో ఓ ఒప్పందం కుదిరిన తర్వాతే మెలానియా వైట్ హౌస్ కు వచ్చారని ఒమరోసా క్లారిటి ఇచ్చారు. దాంతో ఒమరోసా చెప్పిన విషయాలు విన్న తర్వాత ట్రంపుకు మెలానియాకు తొందరలోనే విడాకులు ఖాయమనే అనుకుంటున్నారు. ఇటు అధ్యక్షునిగా ఓడిపోయి అటు భార్యా విడాకులు తీసుకోవటం అంటే పెద్ద దెబ్బగానే చూడాలి.
Tags:    

Similar News