సుభాష్ చంద్రబోస్ మరణం గురించి నెలకొన్న వివాదాలు అన్నిఇన్ని కావు. వీటికి సంబంధించిన విషయాలు ఇప్పటికి ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. నేతాజీ మరణంపై ఎన్నో వాదనలు రావటం.. వాటికి ఖండనలు.. అంతలోనే మరో కొత్త వాదన వినిపించటం మామూలే. ఇదిలా ఉంటే బోస్ కు సంబంధించిన లవ్ స్టోరీ అంశంపై తాజాగా ఒక కొత్త పుస్తకం వచ్చింది.
సుబాష్ చంద్రబోస్.. ఆస్ట్రియా మహిళ ఎమిలీల మధ్య నడిచిన లవ్ స్టోరీ.. వారి వైవాహిక జీవితం గురించి ‘‘ఏ ట్రూ లవ్ స్టోరీ – ఎమిలీ అండ్ సుబాష్’’ పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు బోస్ బంధువు.. మాజీ ఎంపీ కృష్ణ బోస్. ఆయన తన తాజా పుస్తకంలో బోస్ లవ్ స్టోరీని ప్రస్తావించటంతో పాటు.. ఆయన పెళ్లి చేసుకున్న ఎమిలీ గురించిన వివరాలు వెల్లడించారు. బోస్ కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ఆమెను తొలిసారి వియన్నాలో 1934లో కలుసుకున్నట్లుగా పేర్కొన్నారు.
అలా పరిచయమైన వారి మధ్య ప్రేమ చిగురించిందని.. 1937లో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారికి 1943లో ‘‘అనిత’’ అనే అమ్మాయి పుట్టినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు నెలలకు బోస్.. ఎమిలీలు కలుసుకున్నారని.. ఆ తర్వాత మళ్లీ కలిసింది లేదని పేర్కొన్నారు. బోస్ వ్యవహారం మీద మిస్టరీ ఇప్పట్లో తేలేటట్లు లేదు. మరి.. ఆయన కుమార్తెగా చెబుతున్న ‘అనిత’ మాటేమిటి? ఆమె ఎక్కడ ఉంది? ఏం చేస్తున్నారు? అన్న విషయాలు బయటకు వస్తాయా?