అప్పు కాదు.. విరాళాలు ?

Update: 2022-01-19 23:30 GMT
అప్పులు చేయడం కూడా గొప్పే. ఎందుకంటే అది కూడా స్టాటస్ సింబల్ అని చెబుతారు కొందరు మేధావులు. అలా అప్పు చేసి పప్పుకూడు తినడం చాలా మంది చేసే పనే. అయితే అప్పు కూడా అందంగా ఉండాలి. అంటే శక్తికి మించి చేస్తే అప్పుతో తిప్పలు తప్పవు. అది వ్యక్తి అయినా వ్యవస్థ అయినా ఒక్కటే. ఆ విధంగా చూస్తే ఏపీ సర్కార్ అప్పులను బాగానే చేసింది. దాంతో అప్పులు కూడా దొరకడం కష్టమన్న పరిస్థితి కూడా ఏర్పడింది.

దీంతో ఏపీలో త్వరలో చేపట్టే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అప్పుల బదులు విరాళాలకు వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించే అదనపు గదుల కోసం అయ్యే ఖర్చుని మీట్ అయ్యేందులు పెద్ద ఎత్తున విరాళాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.

ఏపీలో మొత్తం 48 వేల 626 అదనపు గదులను ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటోంది.  దీని కోసం ఆరు వేల 321 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తం అప్పు చేయడం వల్ల కూడా కుదరదు అని భావించడంతో విరాళాలు తెచ్చి అయినా అదనపు గదులు నిర్మించాలని సర్కార్ భావిస్తోందని అంటున్నారు.

ఈ విరాళాల కోసం అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి పెద్ద ఎత్తున సేకరించాలని కూడా ప్లాన్ చేస్తున్నారుట. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే రేపటి రోజున మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాల సేకరణ బాట పడతారేమో చూడాల్సిందే.
Tags:    

Similar News