• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇంకా అంతే : పవన్ ఆదేశాలే...

ఇంకా అంతే : పవన్ ఆదేశాలే చంద్రబాబుకు వేదం

By - Tupaki Desk
Update: 2018-03-17 09:33 GMT
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన టేకప్ చేస్తున్నాం ప్రజా సమస్యల విషయంలో ఇన్నాళ్లూ ఒక తరహాగా నడిచింది. రాష్ట్రంలో అప్పుడప్పుడూ ప్రజల ముందు కనిపించి...  ఆయన ఒక్కొక్క ఉద్యమాన్ని  ప్రారంభించడమూ, ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టడం... ఆ వెంటనే చంద్రబాబు నాయుడు ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవడము జరుగుతూ వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజా పోరాటాలు చేస్తున్నట్లుగా ప్రజల కోసం కట్టుబడి ఉన్నట్లు గా ఒక ముద్ర ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు తన వంతు సహకరించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని తూలనాడారు...  అంటారు కానీ ఇప్పటికీ అదే తంతు నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

గుంటూరు అతిసారం బాధితుల గురించి పవన్ కళ్యాణ్ ఒక ఫత్వా  జారీ చేయగానే చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించారు. అధికారుల మీద కన్నెర్ర చేశారు. హుద్ హుద్ తుఫాన్ స్ఫూర్తి ఏమైపోయింది అంటూ అధికారులను నిందించారు.  మీకు చేతకాకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటా అంటూ హూంకరించారు. బాధితుల పరామర్శకు కూడా వెళ్లకపోవడాన్ని తీవ్ర నేరంగా పరిగణించారు. ఇలా రకరకాలుగా.. పవన్ కల్యాణ్ ఎలాంటి డిమాండ్లు అయితే వినిపించారో...  అలాంటి చర్యలన్నీ తీసేసుకున్నారు.

మధ్యలో పవన్ కళ్యాణ్ 48 గంటల గడువు పెట్టడానికి సంబంధించి ఇది సినిమా కాదు అంటూ ఒక కౌంటర్ ఇచ్చారు గాని, మొత్తం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే పని జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటువంటి రహస్య మిత్రబంధం కొనసాగించే బదులు బహిరంగ మిత్రులుగానే చెలరేగవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

ప్రజా పోరాటాల విషయంలో పవన్ ను మరింత హీరోగా ప్రొజెక్టు చేయడానికి, తెలుగుదేశం పార్టనర్ కాదు.. అయినా ప్రజల కోసం పోరాడుతారు.. అనే బిల్డప్ ఇవ్వడానికి ఇద్దరూ ఓ అవగాహనతో ఇలా చేస్తున్నారా? అని కూడా ప్రజలు తలపోస్తున్నారు.
Tags:    
  • Andhra People 
  • Pawan kalyan 
  • Chandrababu Naidu 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS