• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు ఎన్నికల...

బాబు ఎన్నికల జిమ్మిక్కులు...

By - Tupaki Desk
Update: 2018-08-02 17:05 GMT
చంద్రబాబు నాయుడి గారడీ ప్రారంభమైంది. చంద్రబాబునాయుడి ఎన్నికల తాయిలాల పంపిణీ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడి అధికార నిచ్చెనకు ఎన్నికల మెట్లు వేసుకోవడం ఆరంభమైంది. అధికారమే పరమావధిగా పావులు కదపడం ప్రారంభమైంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది గడువు ఉండడంతో ఆయన ఇప్పటి నుంచే ఓటర్ల ఆకర్షకు తలుపులు తీస్తున్నారు. ఎన్నికల ముందు బాబు వస్తే.. జాబు గ్యారంటీ అంటూ ఊదరగొట్టి నిరుద్యోగులకు ఆశలు రేకెత్తించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం వచ్చే సరికి ప్లేటు ఫిరాయిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు గ్యారంటీ అని, కొత్త పరిశ్రమలతో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికారు. తీరా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల మాటే మరిచారు.

బాబు వస్తే... జాబు గ్యారంటీ...ని అటకెక్కించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు తన ప్రయత్నాలు - కుట్రలు - రాజకీయ ఎత్తుగడలకు ద్వారాలు తెరిచారు. దీనికి గురువారం నాటి  ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశమే వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో  నిరుద్యోగులకు భ్రతి ఇస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  ముఖ్యమంత్రి యువనేస్తం అని ఈ పథకానికి పేరు కూడా పెట్టారు. నాలుగేళ్లుగా లేని ఈ కొత్త యువనేస్తం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారని ఈ పథకం గురించి టీవీల్లో చూసిన వారు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా బ్యాంకుల్లో వారి వారి ఖాతాల్లో వెయ్యి రూపాయలు పడతాయని మంత్రి నారా లోకేష్ మంత్రివర్గం సమావేశం అనంతరం చెప్పారు. ప్రజాసాధికారిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులున్నారని - వారికి ప్రతి నెలా 640 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యువనేస్తం పథకం అమలు చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌ లో ఐదారు లక్షల మందికి మించి నిరుద్యోగులు లేరని ఓ సర్వే పేర్కొంది.

ఈ నాలుగేళ్లలోనూ ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదన్నమాట. ఇక ఫించన్ పథకం ఇంటిలో ఒకరికే ఇస్తున్నామని, ఈ యువ నేస్తం మాత్రం ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అందరికీ ఇస్తాం అని ప్రకటించారు. అంటే ఈ నాలుగేళ్ల కాలంలో ఇంటిలో ఒకరికి మించి నిరుద్యోగులు ఉన్నారంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా బాబు వస్తే... జాబు గ్యారంటీ ఏ దశలోనూ అమలు కాలేదనే అర్ధం కదా...!? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో యువకులను ఉద్యోగులుగా మార్చాలని, ఆ తర్వాత వారిని, వారి కుటుంబాలను ప్రయోజకులుగా చేసేందుకు ప్రభుత్వాలు సహకరించాలి కాని... ఇలా నిరుద్యోగ భృతి పేరుతో వారుని వంచించడం తగదని అంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయని మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి లోకేష్ చెప్పారు. అదే నిజమైతే ఆయా కంపెనీలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేయాలి కాని, నెలకు వెయ్యి రూపాయల భృతి  ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

గురువారం నాడు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో విశాఖ మెట్రో రీజియన్‌ ను 5,573 చదరపు కిలోమీటర్ల నుంచి 6,764 చదరపు కిలోమీటర్లకు పెంచారు. ఇందులో కూడా కుట్ర కోణం దాగి ఉంది. ప్రభుత్వం పెంచిన ఈ పరిధి కారణంగా అధికార పార్టీకి చెందిన వారు విశాఖ చుట్టు పక్కల కొనుగోలు చేసిన భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇక్కడ భూములున్న వారిలో తెలుగుదేశం పార్టీ మంత్రులు... శాసనసభ్యులు... నాయకులు ఉన్నారని వేరే చెప్పాలా... !?


Tags:    
  • Andhra 
  • unemployment allowance 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS