• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆనంద్ మహీంద్రా మనసును...

ఆనంద్ మహీంద్రా మనసును దోచేసిన మద్యం షాపు యజమాని

By - Tupaki Desk
Update: 2020-06-16 08:30 GMT
సోషల్ మీడియాలో నిత్యం సందడి చేసే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆసక్తికర పోస్టులు పెట్టే ఆయనకు భారీ ఫ్యాన్ మొయిల్ ఉంది. ఆయన పోస్టు చేసే పోస్టులు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే పోస్టు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరైంది. బీహార్ కు చెందిన ఒక మద్యం షాపు యజమాని చేస్తున్న కొత్త టెక్నిక్ తనను విపరీతంగా ఆకట్టుకుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

ఇందులో షాపు యజమాని ఐదు అడుగులు పొడువున పెద్ద గొట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ గొట్టంలోకి తాడు కట్టి ఒక సీసాను అమర్చారు. వాలుగా ఉండేలా సిద్ధం చేసిన ఆ పైపులోకి సీసా జారేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో సీసాను వెనక్కి లాగేందుకు తాడును ఏర్పాటు చేశారు.

ఎవరైనా వినియోగదారుడు వచ్చినంతనే.. సీసాను తాడు సాయంతో వదులుతారు. అందులో తనకు కావాల్సిన బాటిల్ డిటైల్స్.. డబ్బులు పెడితే.. తిరిగి చిల్లర చెల్లిస్తారు. అది పూర్తి అయిన వెంటనే.. వారు ఆర్డర్ చేసిన మద్యం బాటిల్స్ ను గొట్టం ద్వారా జారవిడుస్తారు. ఈ టెక్నిక్ చూసిన ఆనంద్ మహీంద్రా.. ఈ ఐడియాను మరింత డెవలప్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. దీనికిసంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో అందరిని ఆకర్షిస్తోంది. మీరూ.. ఓ లుక్కేయండి.
Tags:    
  • Anand Mahindra 
  • video of liquor shop contactless pickup 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS