• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రపంచ కుబేరుల జాబితాలో 8...

ప్రపంచ కుబేరుల జాబితాలో 8 వ స్థానంలో అంబానీ .. బిలియనీర్ల లిస్ట్ లో కొత్తగా 50 మంది ఇండియన్స్ !

By - Tupaki Desk
Update: 2021-03-02 13:30 GMT
హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021‌ జాబితా తాజాగా విడుదల అయింది. ఆ జాబితాలో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ ఐఎల్‌) అధిపతి ముఖేష్‌ అంబానీ 2021 హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రూ  రూ 6.09 లక్షల కోట్ల సంపదతో ఎనిమిదవ స్ధానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే ముఖేష్‌ ఆస్తుల విలువ 24 శాతం పైగా పెరిగింది. ఇదే జాబితాలో  గౌతం అదానీ రూ 2.34 లక్షల కోట్ల సంపదతో  48వ స్థానంలో నిలవగా రూ 1.94 లక్షల కోట్ల ఆస్తులతో శివనాడార్‌ ఆయన కుటుంబం 58వ స్ధానంలో నిలిచింది. మరోవైపు స్టీల్‌ దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ రూ 1.4 లక్షల కోట్ల సంపదతో  హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 104వ స్ధానం దక్కించుకున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రమైన పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ పూనావాలా రూ 1.35 లక్షల కోట్ల ఆస్తులతో 113వ ర్యాంక్‌ సాధించారు.  ఇక బిలియనీర్ల క్లబ్ లో కొత్తగా 50 మంది భారతీయలు చేరడం విశేషం.

భారత్‌ లో ప్రస్తుతం 209 మంది బిలియనీర్లు ఉండగా వారిలో 117 మంది భారత్‌లో నివసిస్తున్నారు. ఇక అమెరికాలో 689 మంది బిలియనీర్లు ఉన్నారు.  టెస్లా చీఫ్‌ ఎలన్‌ మస్క్‌ హురున్‌ 19700 కోట్ల డాలర్ల ఆస్తులతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌ పొజిషన్ ‌లో ఉన్నారు.  గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. ఇక అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ 189 బిలియన్‌ డా‌లర్లు,  ఎల్‌ వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 114 బిలియన్‌ డాలర్లు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్ ‌గేట్స్‌ 110 బిలియన్‌ డాలర్లు, ఫేస్ ‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్ ‌బర్గ్‌ 101 బిలియన్‌ డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
Tags:    
  • Mukesh Ambani 
  • Richest Man 
  • Hurun Global Rich List 
  • Hurun Global Rich List 2021 
  • Mukesh Ambani In Hurun Global Rich List 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS