బాబాయిని గెంటేసిన సీఎం

Update: 2016-10-23 10:14 GMT
ఉత్తరప్రదేశ్‌ లోని సమాజ్‌ వాది పార్టీలో సంక్షభం ముదిరి పాకానపడింది.  అక్కడి సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తన మంత్రివర్గం నుంచి నలుగురిని తొలగించారు. అందులో ఆయన బాబాయి శివపాల్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.  దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. కొద్దికాలంలో సమాజ్ వాది పార్టీలో ములాయం - అఖిలేశ్ కేంద్రం గా పార్టీలో - కుటుంబంలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో అఖిలేశ్ తండ్రిని కాదని కొత్త పార్టీ పెట్టుకుంటారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి అఖిలేశ్ ఆదివారం ఉదయం ఊహించని నిర్ణయం తీసుకుని ములాయంకు షాకిచ్చారు.

తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో సమావేశమైన సీఎం అఖిలేష్ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. తన తండ్రి ములాయంకు ప్రీతిపాత్రుడైన తన బాబాయి శివపాల్ యాదవ్ సహా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.  కాగా అఖిలేశ్ మరో బాబాయి రాంపాల్ సింగ్ యాదవ్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు.

సోదరుడు శివపాల్ కు మద్దతిస్తూ కుమారుడు అఖిలేశ్ ను ములాయం చాలాకాలంగా మందలిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. మధ్యలో కొంత సద్దుమణిగినా ఇప్పుడు పీక్ స్టేజికి చేరడంతో ములాయం ఇంట్లో ముసలాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీలుప్రయత్నంచేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News