వూహాన్ సిటీ ప్రస్తుత పరిస్థితి గురించి ఎయిర్ ఇండియా ఫైలెట్ చెప్పిన సంచలన నిజాలు !

Update: 2020-02-15 18:30 GMT
కరోనా వైరస్ ..చైనా తో పాటుగా ప్రపంచంలోని 26 దేశాలు ఇప్పుడు ఈ వైరస్ భారినపడి, దాని నుండి తేరుకోవడానికి అల్లాడిపోతున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ వూహాన్ సిటీని అతలాకుతలం చేసేసింది. అక్కడి స్థానికులు ఈ వైరస్ బారిన పడి చాలామంది మరణించారు. అలాగే వేలకొద్దీ ఈ వైరస్ తో పోరాడుతున్నారు ఇక వూహాన్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విమానాలను పంపి వారిని ఢిల్లీకి చేర్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ ఆపరేషన్ కి కెప్టెన్ అయిన అమితాబ్ సింగ్ ప్రస్తుతం చైనాలోని వూహాన్ నగరంలో ఉన్న పరిస్థితిని వివరించారు.

అయన ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ...ఏదైనా అత్యవసర మిషన్ల కోసం ఎప్పుడూ ఒక టీమ్ రెడీగా ఉంటుందని , వూహాన్ నగరంలో చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకురావాలని నాకు సమాచారం ఇచ్చినప్పుడు వెంటనే ఆ టీమ్‌ లోని సభ్యులందరికీ ఫోన్ చేసి రప్పించామని తెలిపారు. అయితే , ఇదే సమయంలో ఈ విమానంలో ప్రయాణించే సిబ్బందికి వీసా తీసుకురావడం కాస్త కష్టంగా మారిందని, చివరికి అందరికి వీసా ప్రొబ్లెమ్స్ క్లియర్ అయిపోయింది అని తెలిపారు. వూహాన్ నగరంకు బయలు దేరాలంటే ఎవరైనా సిబ్బంది రాలేమని చెప్పారా.. అని ఆయన్ని అడగ్గా ... అలాంటిదేమీ లేదని అందరూ దానికి ఓకే అన్నారని , కానీ , అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేదానిపైన స్పష్టత కావాలని కోరారని తెలిపారు. దీనితో . వెంటనే ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతో ఇక మిషన్ ప్రారంభించామని చెప్పారు.

ఇక వుహాన్ వైరస్ ఉన్న ప్రాంతం కాబట్టి ప్రయాణికులతో ఎక్కువగా మాట్లాడకూడదని భావించి వారికి కావాల్సిన ఆహారం, వాటర్‌ బాటిల్స్ ముందుగానే సీట్లలో ఉంచామని చెప్పారు. జనవరి 31 మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 747 విమానం 34 మంది సిబ్బంది, నలుగురు పైలట్లు, 15 మంది క్యాబిన్ సిబ్బందితో వూహాన్ నగరంకు బయలుదేరిందని చెప్పారు.ఈ ఆపరేషన్ మాకు ఒక ఛాలెంజింగ్‌గా అనిపించడమే కాదు అదో కొత్త అనుభవమని, ఇప్పటి వరకు చైనాలోని ఇతర ప్రాంతాలకు విమానం నడిపామని అయితే వూహాన్‌కు మాత్రం నడపలేదని చెప్పారు. వూహాన్ సిటీ గురించి మాట్లాడుతూ .. 100 అడుగుల ఎత్ తులో లైట్లతో ఉన్న నగరాన్ని చూసినట్లు చెప్పారు. కానీ, సిటీలో ఎక్కడా మనుషులు లేదా వాహనాలు తిరగడం తమకు కనిపించ లేదని , అలాగే వూహాన్ విమానాశ్రయం కూడా చాలా నిశబ్దంగా ఉందని, ఎయిర్ పోర్ట్ లోని అన్ని విమానాలు పార్కింగ్‌ లోనే ఉండి పోయాయని చెప్పారు.

ఆలా, వూహాన్‌ లో ల్యాండ్ అయిన విమానం అక్కడే కొన్ని గంటల పాటు ఉన్నిందని , ఇక ఆ సమయంలో విమానం లో వచ్చిన ఇంజినీర్లు అంతా విమానం తిరిగి వెళ్లేందుకు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని , వారు ఆ పనిలో ఉండగానే, మరోవైపు ఇండియన్ కాన్సులేట్‌ లో ఉన్న భారతీయులందరినీ విమానాశ్రయం కు బస్సులో తరలించినట్లు చెప్పారు. విమానాశ్రయంలో భారతీయులకు పలు మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. ఇక వీరిని ఎయిర్‌పోర్టు లో చూడగానే వారి ముఖాల్లో ఏదో భయం కనిపించిందని , కానీ , ఒక్కసారిగా విమానంలోకి ఎక్కగానే వారి ముఖాల్లో కొంచెం రిలీఫ్ కనిపించిందని చెప్పారు. అలాగే ఆ సమయంలో ఎయిరిండియా సిబ్బందిపై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. అయితే , వుహాన్ వెళ్లివచ్చిన తరువాత వారంరోజుల పాటు అంతా ఐసొలేషన్ సెంటర్‌ లో ఉన్నామని ఇక ఇప్పుడు అన్ని మెడికల్ టెస్టులు పూర్తయి బయటకొచ్చి తిరిగి విధుల్లో చేరినట్లు కెప్టెన్ అమితాబ్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో అవసరం అయితే , మరోసారి వుహాన్ వెళ్ళడానికి సిద్ధమా అని ఆయన్ని ప్రశ్నించగా ... తప్పకుండా వెళతామని కెప్టెన్ అమితాబ్ సింగ్ తెలిపారు. ఇకపోతే ,ఫిబ్రవరి 1న వూహాన్ నగరంలో ల్యాండ్ బోయింగ్ 747 విమానం 324 మంది భారతీయులను, మరో విమానం 323 మంది భారతీయులతో పాటు 7 మంది మాల్దీవులకు చెందిన వారిని వెనక్కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News