ఎస్సై - ఆర్ ఐ - త‌హ‌సీల్దార్ కుమ్మక్కు: భారీగా లంచం డిమాండ్‌..అరెస్ట్‌

Update: 2020-06-07 09:40 GMT
బంజారాహిల్స్ అంటే కోట్ల విలువైన భూములు. ఖాళీ స్థ‌లం క‌నిపిస్తే చాలు క‌బ్జారాయుళ్లు త‌మ పాదం మోపాల‌ని చూస్తారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి కూడా ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసేందుకు త‌ప్పుడు ప‌త్రాలు సృష్టించి ప్ర‌య‌త్నించాడు. అయితే ఉన్న‌తాధికారి అడ్డ‌గించ‌డంతో కోర్టుకు వెళ్లాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఆర్ ఐ - ఎస్ ఐ తాము ప‌ని చేస్తాం.. భారీగా ఇచ్చుకోవాల‌ని చెప్ప‌డంతో ఆ వ్య‌క్తి ఓకే అని డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఈ ముగ్గురు క‌లిసి ప్ర‌భుత్వ భూమి కాజేయాల‌ని చూడ‌డంతో ఉన్న‌తాధికారికి తెలిసింది. వెంట‌నే ఆమె అవినీతి నిరోధ‌క శాఖకు స‌మాచారం ఇవ్వ‌డంతో వారి అవినీతి బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఏకంగా రూ.30 ల‌క్ష‌ల‌కు డీల్ మాట్లాడుకోగా, ఆ డీల్‌లో భాగంగా రూ.15 ల‌క్ష‌లు తీసుకుంటూ ఆర్ ఐ పోలీసుల‌కు రెడ్ హ్యాండేడ్‌ గా ప‌ట్టుబ‌డ్డాడు. దీనిలో ఎస్ ఐ కూడా ఉండ‌డంతో అత‌డిని - డీల్ మాట్లాడిన త‌హ‌సీల్దార్‌ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌ లోని బంజారాహిల్స్‌ లో చోటుచేసుకుంది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లో ఉన్న ఓ స్థలాన్ని తన తండ్రి 1969లో కొనుగోలు చేశారని ఆ భూమిని సర్వే చేసి త‌న వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలంటూ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలిద్ కోరాడు. ఈ విష‌య‌మై షేక్‌ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇది ప్రభుత్వ భూమి అని.. సర్వే కుదరదని ఎమ్మార్వో సుజాత తేల్చిచెప్పాడు. దీంతో అత‌డు కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో స్టే ఉండగానే సయ్యద్ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఈ సంద‌ర్భంగా తహసీల్దార్ బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీని క్యాష్ చేసుకుందామ‌ని ఆర్ ఐ నాగార్జున రెడ్డి ద్వారా తహసీల్దార్ ప్లాన్ వేసింది. ఆమె అత‌డిని రూ.30 లక్షలు లంచం డిమాండ్ ‌చేసింది. దీంతో ఆ వ్య‌క్తి ఏసీబీని ఆశ్రయించారు. వెంట‌నే రంగంలోకి దిగిన అధికారులు  సయ్యద్‌ నుంచి ఆర్‌ ఐ రూ.లక్షన్నర న‌గ‌దు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఇదే వివాదంలో వెన్యూ అధికారులతో రాజీ కుదిర్చి కేసులు లేకుండా చేస్తానంటూ బంజారాహిల్స్‌ ఎస్‌ ఐ ర‌వీంద‌ర్ చేతులు తడిపాడు.

ఈ డీల్‌ లో రూ.3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై ఇప్ప‌టికే రూ.లక్షన్నర తీసుకున్నాడు. మరో రూ.3 లక్షలు డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీకి సమాచారమిచ్చారు. ఆర్‌ ఐ నాగార్జునరెడ్డి - ఎస్‌ ఐ రవీందర్‌ ను అరెస్ట్ ‌చేసి - ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ క్ర‌మంలో గాంధీనగర్‌ లోని తహసీల్దార్ ఇంట్లో అధికారులు త‌నిఖీలు చేశారు. ఆమె నివాసంలో రూ.30 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు - పలు కీలక పత్రాలు లభించాయ‌ని స‌మాచారం. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ఆమెను విచారిస్తున్నారు. ఆర్ ఐ నాగార్జున రెడ్డి - ఎస్సై రవీంద్ర నాయక్‌ ను పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎంత‌మంది ఉన్నారో ఆరా తీస్తున్నారు.





Tags:    

Similar News