• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమీర్ ఖాన్ దుకాణ్ ఎందుకు...

అమీర్ ఖాన్ దుకాణ్ ఎందుకు బందయిందంటే..?

By - Tupaki Desk
Update: 2016-01-20 12:43 GMT
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ ను ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించడం వెనుక ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమన్న అనుమానాలు నిజమేనన తేలిపోయింది.  అది కారణం కాదని గతంలో బీజేపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ తాజాగా ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ మాత్రం అదే కారణమని ధ్రువీకరించారు. అమీర్ భారత్ బ్రాండ్‌ ఇమేజికి  నష్టం కలిగించారని, అందు వల్లే ఆయన్ను ఇన్‌ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌ గా తొలగటించారని ప్రకటించారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించిన ఆయన ఆ బ్రాండ్‌ ను పెంచేలా కృషి చేయాలి తప్ప నష్టం కలిగించరాదు, ఆయన్ను తొలగించడం సరైన చర్యే అని ఆయన అన్నారు.

'ఇన్‌ క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌ గా సుమారు పదేళ్ళపాటు అమీర్‌ ఖాన్‌ పనిచేశాడు. అయితే దేశంలో మత అసహనం పెరిగిపోతోందనీ, ఈ దేశంలో తనకు భద్రత లేదని తన భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ వేరే దేశం వెళ్ళిపోదామని కోరిందంటూ అమీర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ పరిణామాల ఫలితమే అమీర్ ఖాన్ ను తొలగించేలా చేసాయి. మొదట ఆయన తొలగింపునకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ‘ఇన్‌ క్రెడిబుల్‌ ఇండియా' అనే అంశానికి సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామనీ, ఆ ఏజెన్సీ తీసుకున్న నిర్ణయమని వాదించారు. అయితే.... ఇప్పుడు అధికారికంగా అమీర్‌ ఖాన్‌ తొలగింపుపై ఓ అధికారి స్పష్టతనివ్వడం చర్చనీయాంశం అయింది.  మొత్తానికి అమీర్ నోటి దురదే ఆయన పదవి పోయేలా చేసిందని తేలింది.
Tags:    
  • Aamir Khan 
  • India Brand Identity 
  • Amitabh Kant 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS