39మంది భార్యలు,94 మంది పిల్లలున్న వ్యక్తి మృతి

Update: 2021-06-14 07:30 GMT
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద దిక్కు జియోనా చనా (76) కన్నుమూశారు. మిజోరం రాజధాని ఐజాల్ లోని ట్రినిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జియోనా చనా మరణాన్ని మిజోరం సీఎం జోరాంతంగ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జియోనా చనా కొంతకాలంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడుతున్నాడు. జూన్ 7 ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఏమీ తినకుండా చికిత్స పొందుతున్నారు. జూన్ 11న కోమాలోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆదివారం ఆయన్ను ఐజాల్ లోని ట్రినిటీ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటికే జియోనా చనిపోయారు.  

జియోనా మరణంపై ట్వీట్ చేసిన సీఎం జోరాంతంగ.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిస్టర్ జియోనాకు బరువెక్కిన హృదయంతో మిజోరం వీడ్కోలు పలుకుతోంది. ఆయనకు 38 మంది భార్యలు, 89మంది పిల్లలు అని తెలిపారు.

జియోనా గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతోపాటు మిజోరం కూడా పర్యాటకులను ఆకర్షించడానికి జియోనా కుటుంబమే కారణంగా. ఇంత మంది సంతానానికి పురుడు పోసిన జియోనా మరణంపై చాలా మంది సంతాపం తెలిపారు.
Tags:    

Similar News