క్వారంటైన్ చరిత్ర.. 5 శతాబ్ధాల క్రితమే..

Update: 2020-03-31 00:30 GMT
కరోనా మహమ్మారి పాకడంతో ఇప్పుడు దాని పర్యవసనంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. అనుమానితులను క్వారంటైన్ లోకి తరలించారు. కరోనా వచ్చే వరకు జనాలకు కర్ఫ్యూ అంటే ఏంటో తెలుసు.. కానీ లాక్ డౌన్ పూర్తిగా కొత్త.  ఇక క్వారంటైన్ అనేది అస్సలు తెలియదు. కానీ ఇప్పుడు విదేశాల నుంచి కరోనా వెంటపెట్టుకొచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి.. ఒక వ్యక్తి బయట తిరగకుండా వైరస్ ను వ్యాపింపచేయకుండా చేయడానికి.. ఒక ప్రదేశానికే పరిమితం చేసి ఉంచడాన్నే ‘క్వారంటైన్’ అంటారు. అయితే మనకు ఈ పదం కొత్త కానీ.. యూరప్ ఖండంలో కొన్ని వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ అమలు చేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

ఇలా యూరప్ లో క్వారంటైన్ కోసం ప్రత్యేకంగా ఎత్తైన గోడలు, విశాలమైన గదులతో క్వార్టర్లు నిర్మించారు.  ఆ క్వార్టర్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

యూరప్ లోని క్రొయేషియాలో డుబ్రావ్నిక్ అనే పట్టణంలో క్వారంటైన్ కోసం క్వార్టర్లు నిర్మించారు. మధ్యధరా సముద్రం ఒడ్డున ఒక దీవిలా ఉండే ప్రదేశంలో ఈ క్వార్టర్లు మనకు ఇప్పటికీ కనిపిస్తాయి.

14వ శతాబ్ధంలో ప్లేగు వ్యాధి బారిన పడిన వారిని క్వారంటైన్ లో పెట్టడం కోసం వీటిని నిర్మించారు.   వ్యాధిని వ్యాపింప చేయకుండా ఇలా క్వారంటైన్ లో ఉంచి ప్రజలను కాపాడారు.

ప్రస్తుతం ఈ క్వారంటైన్ క్వార్టర్లు టూరిస్ట్ స్పాట్ గా గుర్తింపు పొందాయి. కరోనా నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వచ్చాయి.
Tags:    

Similar News