• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిప్యూటీ సీఎంలు-వెయిట్...

డిప్యూటీ సీఎంలు-వెయిట్ చేయాల్సిందేనా ?

| ఇక మీడియా సైతం వారి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కెలుకుతూ ఉంటుంది వారిలో లేని పోని ఆశలను కల్పిస్తూ ఉంటుంది.

By - Satya P
Update: 2026-02-18 04:30 GMT

ఉప ముఖ్యమంత్రి అన్న పదవి రాజ్యాంగంలో అయితే ఎక్కడా లేదు. మంత్రిగానే వారు ప్రమాణం చేస్తారు ఆ మీదట వారికి ఉప ముఖ్యమంత్రి అన్న హోదాని సీఎం ఇస్తారు. అది రాజకీయంగా చేసుకున్న వెసులుబాటుగా చెబుతారు. వారి డిజిగ్నేషన్ లో ముఖ్యమంత్రి అన్న పేరు ఉంది కాబట్టి వారితో పాటు క్యాడర్ సైతం సంతోషించి సంతృప్తి వ్యక్తం చేసేందుకు ఇదొక సాధనంగా ఉంటోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరవ వేలుగా చెబుతారు. వారికి ఆర్ధికపరమైన పవర్ ఉండదు, విధానపరమైన నిర్ణయాలు సీఎం తర్వాత తామే అని తీసుకునే వీలు ఉండదు, వారు సైతం ముఖ్యమంత్రి వద్ద మిగిలిన మంత్రుల మాదిరిగానే వ్యవహరించాల్సి ఉంటుంది.

కొనసాగుతున్న ట్రెండ్ :

గతంలో ఎక్కడో ఒకటీ అరా ఈ పదవులు ఉండేవి. ఇపుడు ఉప ముఖ్యమంత్రుల ట్రెండ్ అయితే అంతటా కొనసాగుతోంది. ఒక విధంగా ఈ పదవికి ఒక అందం ఆకర్షణ కూడా పెరిగింది అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ అని కొన్ని చోట్ల అనుచరులు పొంగుతున్నారు అయితే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమతో పాటు కలసి తీసుకుని వెళ్ళడానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు వ్యూహాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయంగానే ఎక్కువ మంది భావిస్తున్నారు. దేశంలో చూస్తే ఏపీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఉప ముఖ్యమంత్రుల వ్యవస్థ ఉంది. పంజాబ్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని ఆప్ ఆలోచిస్తోంది.

ఉప ముఖ్యమంత్రులకు బ్యాడ్ టైం :

ఇక డిప్యూటీ సీఎం అనగానే వారితో పాటు అనుచరులు అభిమానులకు కొత్త ఆలోచనలు పుడతాయి. ఇక మీడియా సైతం వారి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కెలుకుతూ ఉంటుంది వారిలో లేని పోని ఆశలను కల్పిస్తూ ఉంటుంది. ఏపీలో ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన వరకూ ఇబ్బంది లేకుండానే పనిచేసుకునిపోతున్నారు. కానీ విపక్ష వైసీపీ మాత్రం పవన్ కి ప్రాధాన్యత లేదని అంటోంది. ఇక జనసేనలో కూడా తమకు తగిన అవకాశాలు దక్కడం లేదు అన్న అసంతృప్తి ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో భట్టి విక్రమార్క అయితే ఒకింత అసంతృప్తిగా ఉన్నారని అని ప్రచారంలో ఉంది. సింగరేణి బొగ్గు గనుల టెండర్ విషయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన కొంత ఆవేదనకు గురి అయ్యారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో కలసి ముందుకు సాగుతున్నారు కానీ డిప్యూటీ అంటే సీఎం అయ్యే చాన్స్ ఉంది అన్న ప్రచారంతోనే చర్చ కొంత మేర సాగుతోంది అంటున్నారు.

కుర్చీలాట మొదలు :

కర్ణాటకలో చూసుకుంటే డిప్యూటీ సీఎం గా ఉన్న డీకే శివకుమార్ కాబోయే సీఎం అని అనుచరులు అంటున్నారు. ఇక సీఎం గా ఉన్న సిద్ధరామయ్య వర్గం అయితే అయిదేళ్ళ సీఎం ఆయనే అని అంటోంది. దీంతో కుర్చీలాట అయితే అక్కడ మొదలైపోయింది. దాంతో ఎవరి ఎమ్మెల్యేలు ఎవరి బలాలు అంటూ లెక్క చూసుకుంటూ మోహరిస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడులో తండ్రి స్టాలిన్ సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. సో ఇబ్బంది లేదు కానీ ఈసారి గెలిస్తే ఉదయనిధి సీఎం అంటేనే పార్టీలో తేడా వస్తుందని అంటున్న వారూ ఉన్నారు.

మహారాష్ట్రలో సీఎం దేవేందర్ ఫడ్నవీస్ కి ఇద్దరు డిప్యూటీలు ఉన్నారు ఏక్ నాధ్ షిండే ఆ మధ్య దాకా అసంతృప్తిగా ఉన్నా ప్రస్తుతం సర్దుకుని పోతూంటే అజిత్ పవార్ బతికి ఉన్నపుడు కొంత గ్యాప్ మెయిన్ టెయిన్ చేశారు. కానీ ఆయన మరణం తర్వాత సతీమణి సునేత్రా పవార్ కి డిప్యూటీ సీఎం ఇచ్చారు కానీ సజావుగా ఎన్సీపీ బీజేపీ సాగుతాయన్న నమ్మకం కనబడడం లేదు అని అంటున్నారు. యూపీలో అదే తీరు సీఎం యోగి ఆదిత్య నాధ్ కి డిప్యూటీ సీఎం కి కొంత గ్యాప్ ఉందని అంటున్నారు. బీహార్ లో నితీష్ సీఎం గా ఉన్నా బీజేపీ కి చెందిన డిప్యూటీ సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ అని అంటున్నారు. దాంతో పార్టీల మధ్య అంతరం కనిపిస్తోందిట. ఏతా వాతా తేలేది ఏంటయ్యా అంటే డిప్యూటీలు సీఎం చెయిర్ వైపు చూడడం సహజం. కానీ ఇందులో ఏ కొద్ది మందో ఇంకా చెప్పాలంటే ఒకరిద్దరికి మాత్రమే ఆ చెయిర్ దక్కుతుంది. మిగిలిన వారు అంతా బ్యాడ్ టైం అనుకోవాల్సిందే అని అంటున్నారు ఇక డిప్యూటీలతో కొత్త రాజకీయ కేంద్రాలు ఏర్పడుతున్నాయని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    
  • deputycm 
  • indianpolitics 
  • statepolitics 
  • politicalanalysis 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS