ఏడేళ్ల బాలికపై రే*ప్.. డ్రమ్ములో ముంచేసి చంపేసిన ఎదురింటోడు!

మదనపల్లె పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలిక రెండో క్లాస్ చదువుతోంది. సోమవారం బడికి సెలవు కావటంతో ఇంటి వద్దే ఉంది.;

Update: 2026-02-18 05:07 GMT

ఎదురింటోడు యముడయ్యాడు. గంజాయి.. మద్యానికి బానిసై జులాయిగా తిరగే ఇతగాడ్ని.. పోలీసులు ఏమీ చేయకపోవటం.. కనీసం కౌన్సెలింగ్ ఇవ్వని అలసత్వం ఏడేళ్ల బాలిక ప్రాణం పోయేలా చేసింది. అత్యంత అనాగరికంగా అత్యాచారానికి పాల్పడి.. తాను చేసిన దారుణం బయటకువస్తుందన్న ఆలోచనతో నీళ్ల డ్రమ్ములో బాలికను ముంచేసి చంపేసి అతగాడి అరాచకత్వం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంపేసి.. అదే గదిలో రాత్రంతా పడుకున్న వాడి తీరు చూస్తే.. ఇలాంటోడ్ని ఏం చేసినా తప్పు లేదన్న భావన కలగటం ఖాయం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో చోటు చేసుకున్న ఈ కిరాతక ఘటనలోకి వెళితే..

మదనపల్లె పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలిక రెండో క్లాస్ చదువుతోంది. సోమవారం బడికి సెలవు కావటంతో ఇంటి వద్దే ఉంది. చిన్నారి తల్లి పనికి వెళ్లింది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయం లో ఇంటి వద్దే ఉన్న తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడిగింది. చిన్నారి ఇంట్లో లేదని చెప్పాడు. స్నేహితుల ఇంటికి ఆడుకోవటానికి వెళ్లిందేమో అని తొలుత భావించినా.. ఆ తర్వాత ఎంతసేపటికి రాకపోవటంతో చుట్టుపక్కల గాలించారు.

అయినా.. ఆమె ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. స్థానికంగా వాట్సప్ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. పోలీసుల గాలింపు ఎలాంటి పలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇంటి చుట్టుపక్కల ఎవరుంటారన్న ఆరా తీశారు. ఈ క్రమంలో చిన్నారి ఇంటి ఎదురుగా ఉండే కులవర్ధన్(30)కు నేరచరిత్ర ఉండటంతో అర్థరాత్రి ఒంటి గంట సమయం  లో అతడి ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. ఎంతసేపు ప్రయత్నించినా.. తలుపు తీయలేదు. కిటికీ వద్దకు వెళ్లి చూడగా.. నిద్రపోతున్నట్లుగా గుర్తించి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చిన్నారి చివరిసారి కులవర్ధన్ తో చూసినట్లుగా బాధితురాలి తాత చెప్పటంతో మళ్లీ పోలీసులు ఉదయం ఏడు గంటలకు అతడి ఇంటివద్దకు వెళ్లి.. తలుపులు బద్ధలు కొట్టారు.చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. మంగళవారం రాత్రే అతడి ఇంటి తలుపులు తెరిపించి గాలిస్తే బాగుండేదన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. తల్లితో కలిసి ఉండే కుల వర్ధన్ గంజాయి, మద్యానికి అలవాటు పడ్డాడు. అతడి తల్లి స్కూల్లో ఆయాగా పని చేస్తూ ఉంటుంది.

కులవర్ధన్ కు నేర చరిత్ర ఉంది. గతంలో కొడవలితో ఒకరిపై దాడికి దిగగా కేసు నమోదైంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర ఉంది. ఇద్దరు ముగ్గురు మహిళలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి బెదిరింపులకు భయపడి ఆ కంప్లైంట్లను వెనక్కి తీసుకున్నారు. అతడికి ఎలాంటి కౌన్సెలింగ్ తీసుకోలేదు. తాజా పరిణామం నేపథ్యంలో నిందితుడి ఇంటి వద్ద స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందతుడ్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు చిన్నారి డెడ్ బాడీని కదపనివ్వమంట నిరసన చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోమంత్రి అనిత.. జిల్లా కలెక్టర్.. ఎస్సీలు నచ్చజెప్పి.. పోస్టుమార్టంకు ఒప్పించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రానికి బాలిక పోస్టుమార్టం వివరాల్ని డీఐజీ ప్రకటించారు. చిన్నారిని అత్యాచారం చేసి.. డ్రమ్ములో ముంచి చంపినట్లుగా ప్రకటించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News