స్మార్ట్ ఫోన్ లోనే రోజుకు 7 గంటలు..!
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ మయం.. తిన్నా.. పడకన్నా.. లేచినా ఒకటే ఫోన్ కలవరింతలు.. ఒక పోస్టు వాట్సాప్, ఫేస్ బుక్ లో పెడితే దాన్ని ఎందరు చూశారు? ఎంత మంది లైక్ లు కొట్టారు? ఎంతమంది కామెంట్స్ చేశారు.? ఇక దానికి రెస్పాన్స్ రాకపోతే తిండి మానేసే యువత కూడా ఉన్నారు. ఇక ఉద్యోగులకు వాట్సాప్ గ్రూపులు, మెసేజ్ లు, పనుల విభజన, అంతా రచ్చ రంబోలా స్మార్ట్ ఫోన్ లోనే..
స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించలేం. అన్ని దానితోనే అయిపోతున్నాయి. డబ్బుల చెల్లింపుల నుంచి ప్రతి అవసరం , వర్క్, ఇతర పనులన్నీ ఫోన్ ద్వారా జరిగిపోతున్నాయి. నిత్యావసరంగా మారిన ఫోన్ మన జీవితాల్లో ఇప్పుడు భాగమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం కరోనా రాకతో అంతా స్తంభించిపోయింది. వ్యవస్థ అంతా ఇంటి నుంచే అయ్యింది. కరోనాతో స్మార్ట్ ఫోన్లు ప్రజల జీవితాల్లో భాగమయ్యాయి.
ఇప్పుడంతా వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసులు, ఎంటర్ టైన్ మెంట్ కోసం ఫోన్లు తెగ వాడేస్తున్నారు. తాజా సర్వే ప్రకారం భారతీయుల సగటు స్మార్ట్ ఫోన్ వినియోగం 25శాతం పెరిగి రోజుకు దాదాపు 7 గంటలకు చేరిందని తేలింది.
84శాతం మంది ప్రతి 15 నిమిషాలకోసారి ఫోన్ చూసుకుంటున్నారని.. 74శాతం మంది తాము మొబైల్ వాడకపోతే అసహనానికి గురవుతున్నట్టు ఒప్పుకున్నారని సర్వేలో తేలింది.
ఇలా ఫోన్ ప్రస్తుతం మనిషికి వ్యసనంగా మారింది. కరోనాటైంలో దాని వినియోగం భారీగా పెరిగిందని అర్థమైంది. అది లేని జీవితాన్ని ఊహించని విధంగా తయారైనట్టు తెలుస్తోంది.