• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఏఏకు మద్దతుగా 52 లక్షల...

సీఏఏకు మద్దతుగా 52 లక్షల మిస్‌డ్ కాల్స్ !

By - Tupaki Desk
Update: 2020-01-07 08:10 GMT
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తం గా పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రం ఈ చట్టానికి వ్యతిరేకం అని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సీఏఏకు దేశవ్యాప్త మద్దతును సమీకరించాలనే ఉద్దేశం తో బీజేపీ శుక్రవారం మిస్‌డ్ కాల్ పద్దతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 8866288662 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేసింది. ఈ టోల్ ఫ్రీ నంబర్‌ కు ప్రజల నుంచి భారీగా మద్ధతు లభిస్తుంది.

ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పౌరసత్వ చట్టానికి మద్దతును ప్రకటిస్తూ తమకు 52 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తాము ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 68 లక్షల కాల్స్ వచ్చాయని అమిత్ షా తెలిపారు. వాటన్నింటిలో 52 లక్షల 72 వేల కాల్స్ వెరిఫైడ్ కాల్స్‌గా తేలాయని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా CAAకి వ్యతిరేకం గా నిరసనలు జరుగుతున్నాయి.

ఇక ప్రజలకు CAA పట్ల ఉన్న అనుమానాలన్నింటిని తొలగించేందుకు బీజేపీ ఆదివారం నుంచి డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.ఇక అమిత్ షా సోమవారం ఢిల్లీలోని లజపత్ నగర్‌లో సందర్శించారు. సవరించిన పౌరసత్వ చట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలతో మాట్లాడారు. వారిలో ఈ చట్టం పట్ల అవగాహాన పెంచేందుకు ఆయన ప్రయత్నించారు. అంతేకాకుండా, ఆయనే స్వయంగా ఈ అంశానికి సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఏదేమైనా కూడా ఈ చట్టం అమలుపై వెనక్కి తగ్గేది లేదు అని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమౌతుంది.


Tags:    
  • CAA protests 
  • CAA protests Uttar Pradesh 
  • CAA protests Karnataka 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS