ఫోర్జరీ పత్రాలతో తెలంగాణలో రూ.480 కోట్ల దోపిడీ
తెలంగాణలో భారీ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ లో ఏకంగా రూ.480 కోట్లు దోచుకున్నారు. ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ పత్రాలతో రూ.480 కోట్లు కొల్లగొట్టారు.ఫోర్జరీ దస్త్రాలతో బ్యాంకులను మోసగిస్తున్న హైదరాబాద్ కు చెందిన దంపతులు పరిచూరి కుమార్, అతడి భార్య పోకల పల్లవిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.వీరిద్దరూ ఫోర్జరీ పత్రాలు పెట్టి ఏకంగా ఎస్బీఐలో రూ.480 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరి మోసాన్ని ఎస్బీఐ అధికారులు గుర్తించారు. ఈ మోసంలో ఎస్బీఐ అధికారి ప్రమేయం కూడా ఉందని బ్యాంకు అధికారులు తేల్చి సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు పరుచూరి కుమార్, అతడి భార్య పల్లవి, ఎస్బీఐ అధికారి రవూఫ్ పాషా, న్యాయవాదులు ఉమాపతిరావు, హరిహరబాబులపై కేసు నమోదు చేశారు. వీరి మోసం ఎలా చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ఇంతటి వందల కోట్ల మోసం అంత ఈజీగా ఎలా జరిగింది? ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ప్రమేయం ఉన్నట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.