డేటింగ్ యాప్ తో 16మందిని ఊడ్చేసింది .. ఎలా అంటే ?
డేటింగ్ యాప్ అడ్డు పెట్టుకొని మగాళ్లకు వల వేసి డబ్బులు దోచేసిన ఓ కిలాడీ లేడీని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సోషల్ మీడియా వేదికగా మగాళ్లకు వలవేసి దోచుకొంటుంది. అసలు ఆన్లైన్ లో జరిగే మోసాల గురించి ఎంతగా చెప్తున్నా కూడా ఏ ఒక్కరూ కూడా వినిపించుకోవడం లేదు. ఆన్లైన్ లో అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు .. ఒంటి పైన బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియని మైకం లోకి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత వారిని దోచేసి నడిరోడ్డు మీద నిలబెడితే అప్పుడు లబోదిబోమంటున్నారు.
తాజాగా ఈ తరహా మోసం చేస్తున్న మరో ఖిలేడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా మగాళ్లకు వల వేయడం , చిక్కిన వారికి డ్రగ్స్ ఇచ్చి దోచేయడం పనిగా పెట్టుకుంది. అలా ఏడాది కాలంగా 16 మందిని దోచేసింది. చివరకు ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే .. బీసీఏ డ్రాపౌట్ అయిన నిందితురాలు ఓ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో పని చేసేది.
అయితే లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయింది. దాంతో ఇంటికే పరిమితమైన నిందితురాలు ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ టిండర్, బంబుల్ లో తన ప్రొఫైల్ ని అప్ లోడ్ చేసింది. యాప్ ద్వారా పరిచయమైన మగాళ్లను తన మాటలతో మాయ చేసేది. ఆ తర్వాత వారిని కలుసుకోవాలని ఉందంటూ హోటల్ కి రప్పించేది. వచ్చని వారికి మత్తు మందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి.. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకునేది.
ఈ విధంగా చేస్తూ ఇప్పటివరకు దాదాపు 16 మందిని ముంచేసింది. ఈ క్రమంలో ఆశిష్ కుమార్ అనే బాధితుడు కూడా నిందితురాలి వలలో పడి, పుణెలోని ఓ హోటల్ లో ఆమెని కలుసుకునేందుకు వెళ్లాడు. నిందితురాలు అతడికి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి, అతడి వద్ద ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలను తీసుకోని వెళ్ళిపోయింది. మెలకువ వచ్చి చూసిని ఆశిష్‌కి డబ్బు, బంగారం మాయమవ్వడం.. నిందితురాలు కనిపించకపోవడంతో జరిగిన మోసం పూర్తిగా అర్థం అయ్యింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఖిలేడి వ్యవహారం బట్టబయలైంది. ఆమె వద్ద నుంచి 15.25 లక్షల విలువైన బంగారం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు.