మోడీతో దేశానికి ఎంత డేంజరో చెప్పిన 13 విపక్షాలు
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పదమూడు పార్టీల అధినేతలు ఏకకాలంలో గళం విప్పటమే కాదు.. మోడీ కారణంగా దేశానికి ఎంత డేంజర్ అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలకంగామారితే.. ఆమె గళం మరింత గట్టిగా వినిపించేలా చేయటంలో కీలక అధినేతలు రంగంలోకి దిగటం గమనార్హం.
దేశంలో విద్వేషం.. మతోన్మాదం.. అసహనం.. అసత్యం అంతకంతకూ పెరుగుతున్నాయన్న ఆందోళనను వ్యక్తం చేశాయి పదమూడు రాజకీయ పార్టీల అధినేతలు.
మత విశ్వాసాలు.. పండుగలు.. భాష.. ఆహారం.. చివరకు వేసుకునే వస్త్రాల విషయంలోనూ ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని.. ఇలాంటి వాటిని కొనసాగించకూడదని.. ఈ విద్వేష సునామీని ధీటుగా ఎదుర్కోవాలని వారు కోరుకుంటున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న విద్వేష ప్రసంగాలు.. మత హింసపై పదమూడు విపక్ష పార్టీ నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఈ స్థాయిలో తమ ఆందోళనను వ్యక్తం చేసిన పదమూడు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఎవరంటే..
1.కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ
- టీఎంసీ అధినేత్రి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
- డీఎంకే అధినేత.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
- జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్
- ఎన్సీపీ అధినేత శరద్ పవార్
- ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్
- నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా
- సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- సీపీఐ కార్యదర్శి డి రాజా
- ఫార్వర్డ్ బ్లాక్ దేబబత్ర బిస్వాన్
- ఆర్ఎస్ పీ మనోజన్ భట్టాచార్య
- ముస్లింలీగ్ పీకే కున్హాలి కుట్టి
- సీపీఐ (ఎంఎల్) దీపాంకర్ భట్టాచార్య
ఇటీవల కాలంలో కర్ణాటకలోని హిజాబ్ వివాదం.. రామనవమి సందర్భంగా దేశంలో తలెత్తిన ఘర్షణలు.. జేఎన్ యూలో మాంసాహారంపై వివాదాలకు సంబంధించిన అంశాల్నిఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ ప్రజలకు 13 విపక్షాలు విడుదల చేసిన లేఖలో ప్రధాని మోడీ మౌనంపై ఆందోళన వ్యక్తం చేయటంతో పాటు.. ప్రముఖ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ‘ఎ వైరస్ రేజెస్’ పేరుతో ఒక ప్రత్యేక కథనాన్ని రాశారు. ఏమైనా.. మోడీ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఒకే జట్టు కట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.