భర్త 'హిట్‌మ్యాన్' అయితే భార్య ‘వోడాఫోన్ పగ్’ కావాలోయ్: మద్రాస్ హైకోర్టు క్లాస్
విషయంలోకి వెళ్తే.. ఒక దంపతుల మధ్య గొడవ జరిగి దాదాపు 16 ఏళ్లవుతోంది. భర్తగారు ఉద్యోగం కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు.
మనుషులు పెళ్లిళ్లు చేసుకునేది కలిసి జీవించడానికా.. లేక ఒకరి వెనకాల ఒకరు "జింగిడీ జింగిడీ" అంటూ గొర్రెల మందలా తిరగడానికా? ఈ గంభీరమైన సందేహానికి మద్రాస్ హైకోర్టు పంచ్‌లతో కూడిన సమాధానం చెప్పేసింది. 'లైఫ్ పార్ట్‌నర్ అంటే పార్ట్‌నర్ అంతే... 24 గంటలు వెంట తిరిగే వోడాఫోన్ పగ్ కుక్కపిల్ల కాదు' అని తేల్చిచెప్పేసింది.
అసలేం జరిగింది?
విషయంలోకి వెళ్తే.. ఒక దంపతుల మధ్య గొడవ జరిగి దాదాపు 16 ఏళ్లవుతోంది. భర్తగారు ఉద్యోగం కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. భార్య మాత్రం "నా ఉద్యోగం.. నా బాధ్యతలు.. నా ఆశయాలు నాకు ముఖ్యం నాయనా" అని చెన్నైలోనే ఉండిపోయింది. దీంతో కథ కాస్తా ఫ్యామిలీ కోర్టుకిక్కింది. అప్పట్లో ఫ్యామిలీ కోర్టు "ఏందయ్యా ఇదీ... భార్యని తీసుకెళ్లడం నీ బాధ్యత కాదా?" అని భర్త వైపు వేలు చూపించింది.
అయితే కథ మద్రాస్ హైకోర్టుకి చేరాక అసలు సీన్ మారింది. ఫ్యామిలీ కోర్టు జడ్జిగారి లాజిక్‌ని పక్కన పెట్టి, "భర్త ఎక్కడికి పోతే భార్య అక్కడికి తోకలా వెళ్లాలా ఏంది?" అంటూ హైకోర్టు గట్టిగానే రియాక్ట్ అయ్యింది.
‘వోడాఫోన్ డాగ్’ వర్సెస్ ఇండిపెండెంట్ భార్య
ఒకప్పుడు వోడాఫోన్ అడ్వర్టైజ్మెంట్‌లో ఒక చిన్న పగ్ కుక్కపిల్ల కుర్రాడు ఎక్కడికి పోతే అక్కడికి నెట్‌వర్క్ లాగా వెనకాలే పరుగెత్తేది. "భర్త వెనకాల భార్య కూడా అలాగే తిరగాలని అనుకోవడం డెమోక్రసీ కాదయ్యా.. ఆటోక్రసీ" అని కోర్టు పరోక్షంగా సెటైర్ వేసింది. పెళ్లయినంత మాత్రాన ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, కెరీర్‌ను కొబ్బరికాయలా దేవుడి ముందు కొట్టేసి భర్త అడుగుల్లో అడుగులు వేస్తూ కాలం గడపాలనడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించింది.
తీర్పులో తేలిందేంటి?
16 ఏళ్లుగా విడిగా ఉంటూ బొమ్మ కనిపించకుండా పోయిన ఈ బంధాన్ని బలవంతంగా అతుకేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే భర్తగారు ఉచితంగా బయటపడకుండా "ఆమె ఆర్థిక భద్రత కోసం రూ. 7 లక్షలు అల్మారాలోంచి తీసి భరణంగా ఇవ్వండి" అని ఆర్డర్ వేసింది.
లైఫ్‌లో పెళ్లి అనేది ఒక ప్రయాణం. దానికి పరస్పర గౌరవం, అర్థం చేసుకునే మనసు ఉండాలి తప్ప.. "నేను ఎక్కడికెళ్తే నువ్వు అక్కడికి రావాల్సిందే" అనే పాతకాలపు రూల్స్ నడవవు. భార్య అయినా, భర్త అయినా తమ సొంత కెరీర్ నిర్ణయాలు కలిగి ఉండే హక్కు ఉంది. సో, భర్తలారా... మీ భార్యలను మీ వెంట తిరిగే 'నెట్‌వర్క్' అనుకుంటే పొరపాటే వాళ్లకు కూడా ఓ ప్రత్యేకమైన 'ఫ్రీక్వెన్సీ' ఉంటుంది జాగ్రత్త..