'షిక్కటి షిరునవ్వుతో'... (వైసీపీ యాప్ పై) ఏపీ మంత్రి వెటకారం ఇది!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ అయిన విషయాల్లో "రెడ్ బుక్" అనేది ఒకటనే సంగతి తెలిసిందే.;
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ అయిన విషయాల్లో "రెడ్ బుక్" అనేది ఒకటనే సంగతి తెలిసిందే. గతంలో చట్టాలను దిక్కరించి నడుచుకున్నవారికి తమ ప్రభుత్వంలో చట్టప్రకారం శిక్ష విధిస్తున్నామని టీడీపీ నేతలు చెబుతుండగా... ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. అక్రమ కేసులకు అడ్డాగా ఏపీ మారిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
తమ పార్టీకి చెందిన నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారని.. ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని.. ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు! ఇదే సమయంలో... గ్రౌండ్ లెవెల్ లో పార్టీ క్యాడర్ మీద వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తోన్నారు. ఈ సమయంలో వైసీపీ యాప్ తెరపైకి వచ్చింది!
ఇందులో భాగంగా... వైసీపీ కూడా రెడ్ బుక్ కాదు కానీ కౌంటర్ అన్నట్లుగా ఒక కొత్త యాప్ ని తీసుకుని వస్తోంది. ఈ విషయాన్ని జగన్ పీఏసీ సమావేశంలో ప్రకటించారు. వైసీపీలో ఉన్న వారు అధికారుల వల్ల పోలీసుల వల్ల లేక ఏ నాయకుడి వల్ల అయినా ఇబ్బందులు పడుతున్నట్లయితే యాప్ లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ఓ పోస్ట్ పెట్టారు.
అవును... రెడ్ బుక్ ని కౌటర్ గా అన్నట్లుగా వైసీపీ ఓ యాప్ ని తీసుకొస్తోన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ తన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. "అన్న పోలీసులు పట్టుకున్నారు. కాపాడన్నా." అని ఎవరైనా అడిగితే... దానికి సమాధానంగా... "నువ్వేం కంగారు పడకు.." అని మొదలుపెట్టి 11 స్టెప్స్ ని వివరించినట్లుగా ఆ పోస్ట్ ఉంది.
ఇందులో భాగంగా...
1) ఫోన్ తీసుకో
2) ప్లే స్టోర్ ఓపెన్ చేయి
3) రప్పా రప్పా యాప్ డౌన్ లోడ్ చేసుకో
4) లాగిన్ అవ్వు
5) ఓటీపీ వస్తుంది.. ఎంటర్ చేయి
6) అక్కడ 11 పేజీల ఫామ్ ఉంటుంది
7) షిక్కటి షిరునవ్వుతో ఫిల్ చెయ్యి
8) లాస్ట్లో "వై నాట్ 175" అనే బటన్ మీద క్లిక్ చెయ్యి
9) 4 ఏళ్లు కళ్ళు మూసుకో.. అందరికీ సినిమా చూపిద్దాం ఓకేనా అని మెసేజ్ వస్తుంది
10) కింద "షిద్ధం" బటన్ మీద క్లిక్ చెయ్యి
11) అంతే ఇంక అంతా దేవుడు షూసుకుంటాడు
అనే పోస్ట్ చేసిన సత్యకుమార్ యాదవ్... "సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే... సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని షేర్ చేస్తున్నాను. అజ్ఞాత సృష్టికర్త సృజనాత్మకతకు అభినందనలు" అని రాసుకొచ్చారు! దీంతో... ఈ పోస్ట్ వైరల్ గా మారింది. వైసీపీ యాప్ కు ఈ టైపులో సెటైర్స్ వేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.