2026 నాదే అంటున్న జగన్
పార్టీలో అధినాయకత్వం నిర్ణయాలు చేయడం దిగువ స్థాయిలో పాటించడం కాదు, దిగువ స్థాయి నుంచే సలహాలు సంప్రదింపులు రావలని జగన్ కోరుతున్నారు.;
ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీ ఇక దూకుడుగానే ముందుకు సాగనుంది. దానికి సంబంధించిన సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఒక యాక్షన్ ప్లాన్ నే రూపొందించారు. పార్టీని పైకి లేపడం మీద ఆయన తెర వెనక తీవ్రమైన కసరత్తునే చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా తాడేపల్లి లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. పార్టీలో సుప్రీం ఆంటే ఎవరో కూడా జగన్ తేటతెల్లం చేశారని అంటున్నారు.
క్యాడర్ తోనే అంతా :
పార్టీకి కార్యకర్తలే ముఖ్యం అని జగన్ తెలుసుకున్నారు. అదే ఆయన నోట కూడా వస్తోంది ఇది మంచి పరిణామం అని నేతలు అంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చూసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని కూడా అంటున్నారు. జగన్ సైతం కార్యకర్తలకే పెద్ద పీట వేస్తామని కూడా పదే పదే చెబుతున్నారు. వారితోనే పార్టీ అని కూడా అంటున్నారు. రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే కనుక క్యాడర్ తోనే అన్నీ చేయిస్తామని కూడా ఒక కచ్చితమైన హామీ ఇచ్చేశారు.
బాటం టూ టాప్ :
పార్టీలో అధినాయకత్వం నిర్ణయాలు చేయడం దిగువ స్థాయిలో పాటించడం కాదు, దిగువ స్థాయి నుంచే సలహాలు సంప్రదింపులు రావలని జగన్ కోరుతున్నారు. ఆయన గతంలోనే జిల్లా కమిటీలకు ఫుల్ పవర్స్ అని చెప్పేశారు. ఏ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఆ జిల్లా పెద్దలే కూర్చుని సొంతంగా కార్యక్రమాలు చేపట్టాలని అధినాయకత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం చూడకూడదని కూడా దిశా నిర్దేశం చేశారు, ఇపుడు మరింతగా వికేంద్రీకరణ దిశగా ఆయన లోతుల్లోకి వెళ్తున్నారు. గ్రామ వార్డు బూత్ లెవెల్ కమిటీలతోనే పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నారు. దిగువ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన శక్తి సమకూరుతుందని అంటున్నారు. అందుకే బాటం టూ టాప్ అని కొత్త కాన్సెప్ట్ ని వైసీపీ అమలు చేస్తోంది.
కమిటీలు పూర్తి చేయాల్సిందే :
వైసీపీ కమిటీలు బూత్ లెవెల్ దాకా డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ ఒక డెడ్ లైన్ విధించారు. దాంతో పాటుగా ప్రతీ అసెంబ్లీ ఇంచార్జ్ పనితీరుని మధింపు చేస్తామని జగన్ చెబుతున్నారు. అలా ఎవరు బాగా పనిచేస్తూ పార్టీ నిర్మాణం పకడ్బంధీగా చేపడుతారో వారికే పెద్ద పీట అంటున్నారు. అంతే కాకుండా ఎవరైతే ప్రజలతో మమేకం అవుతారో వారికే ప్రాధాన్యత లభిస్తుంది అని కూడా అంటున్నారు. అలా పనిచేయని వారిని పక్కన పెడతామని హెచ్చరిస్తున్నారు.
కొత్త ఏడాది కొత్తగా :
ఇక 2025లో చూస్తే మరో మూడు నెలలలో పూర్తి కావస్తోంది. జగన్ అక్టోబర్ నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్నారు. దాంతో ఆయన అందుబాటులోకి రాకపోవచ్చు అని అంటున్నారు. ఇక నవంబర్ డిసెంబర్ లలో పార్టీ నేతలకు ఇచ్చిన కార్యక్రమాల మీదనే ఫోకస్ పెడతారు అని అంటున్నారు. డిసెంబర్ నాటికి కమిటీలు పూర్తి అయితే జగన్ కొత్త ఏడాది నుంచి భారీ యాక్షన్ ప్లాన్ తో బరిలోకి దిగుతారు అని అంటున్నారు. 2026 లో సంక్రాంతి పండుగ పూర్తి అవుతూనే జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు. 2026 కి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అందుకే జగన్ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేసి పార్టీ శ్రేణులతో నేరుగానే బేటి అవుతారని పార్టీ కమిటీలను స్థానిక సమరానికి సమాయత్తం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో ప్రజలతో కూడా మమేకం అవుతూ వీలైనన్ని చోట్ల సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తారు అని అంటున్నారు. సో జగన్ జనంలోకి తొందరలో వస్తాను అని తాజా మీటింగులో చెప్పారని అంటున్నారు.