ఐప్యాక్ కాదు కొత్త సర్వే...వైసీపీ నమ్మేది అదే !

ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే బీహార్ ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి భారీ ఓటమిని ఎదుర్కోవడంతో వైసీపీ పెద్దల ఆలోచనలు సమూలంగా మారిపోయాయని అంటున్నారు.;

Update: 2025-12-04 03:15 GMT

వైసీపీ అధినాయకత్వం లో ఎంతో మార్పు వచ్చింది అని అంటున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే బీహార్ ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి భారీ ఓటమిని ఎదుర్కోవడంతో వైసీపీ పెద్దల ఆలోచనలు సమూలంగా మారిపోయాయని అంటున్నారు. వ్యూహకర్తలు కార్పోరేట్ కల్చర్ తో స్ట్రాటజీలు గాలిలో మేడలని అర్ధం అయింది అంటున్నారు. ఎక్కడో కూర్చుని గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలియకుండా చేసే సర్వేలను నమ్ముకునే భారీ మూల్యం ఇప్పటికే చెల్లించామని కూడా పార్టీ భావిస్తోంది అని అంటున్నారు.

నో చాన్స్ :

ఇక చూస్తే కనుక 2017లో ఐప్యాక్ టీం వైసీపీకి కన్సల్టెన్సీ కుదిరింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ అప్పటికే గెలుపు గుర్రం భావించే ఐప్యాక్ తరఫున ప్రశాంత్ కిశోర్ వచ్చి చేరారు అని వైసీపీ నేతలు ఇప్పటికీ అంటూంటారు. ఒకవేళ ఐప్యాక్ లేకపోయినా వైసీపీ గెలిచేది అని కూడా వారు చెబుతూ ఉంటారు. ఇక 2019 తరువాత పీకే ఐప్యాక్ నుంచి వేరుపడినా రిషి రాజ్ తో నడచిన ఐప్యాక్ తో వైసీపీ ఒప్పందం చేసుకుని అయిదేళ్ళ పాటు కొనసాగించింది. అయితే ఆ సంస్థ ఇచ్చిన సర్వేలు అన్నీ జనంతో సంబంధం లేకుండానే ఉన్నాయన్నది 2024 ఎన్నికల ఫలితాల తరువాతనే తెలిసింది అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ఐప్యాక్ కి నో చాన్స్ అని చెబుతున్నారు. అంతే కాదు ఏ రకమైన సర్వే టీంలకు ఇప్పట్లో వైసీపీ నుంచి ఆహ్వానం ఉండదని చెబుతున్నారు.

వారినే నమ్ముకుంటూ :

వైసీపీలో కరడు కట్టిన క్యాడర్ ఉంది. అలాగే పార్టీయే సర్వస్వం జగనే దైవం అని భావించే తృతీయ శ్రేణి నాయకులు ఇంకా చిన్న నాయకులు ఉన్నారని అంటున్నారు. వీరంతా ప్రతీ నియోజకవర్గంలో ఉన్నారు. వారినే ఒక టీం గా చేసి వైసీపీ కేంద్ర కార్యాలయం వారితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుందని చెబుతున్నారు. దాంతో నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల గురించి కానీ పార్టీ నేతల తీరు కానీ కూటమి గురించి కానీ జనంలో పార్టీ గ్రాఫ్ మీద కానీ అన్నీ ఈ టీం నుంచే వైసీపీ హైకమాండ్ తీసుకుంటోంది అని అంటున్నారు వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కచ్చితంగా ఉందని నమ్ముతోందిట. దాంతోనే పార్టీ పరంగా చర్యలు తీసుకోవడమే కాదు పనిచేసే వారికి పదవులు ఇస్తోందని చెబుతున్నారు.

వారంతా దూరమే :

ఇక వైసీపీ ఈసారి గెలిచి తీరాలీ అంటే పార్టీలో పనిచేయని వారిని దూరం పెట్టాలని కరడు కట్టిన వైసీపీ క్యాడర్ అధినాయకత్వాన్ని కోరుతోంది. అలాగే పార్టీలో ఉంటూ గోడ మీద పిల్లుల మాదిరిగా వ్యవహరించే వారి విషయంలోనూ కచ్చితంగా వ్యవహరించాలని సూచిస్తోంది. పార్టీని వీడిపోయిన వారు ఎన్నికల ముందు వస్తే కనుక వారిని తీసుకోవద్దని చెబుతున్నారు. ఇక వైసీపీలో కష్టపడే వారిని గుర్తించాలని వారికే భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారని అంటున్నారు.

నేతలలో వేడి :

పార్టీ క్యాడర్ తోనే నేరుగా వైసీపీ హైకమాండ్ అనుసంధానం అవుతున్న నేపధ్యంలో నాయకులు కూడా చురుకుగా ఉండాల్సి వస్తోంది అని అంటున్నారు. ఎప్పటికపుడు ఎవరు పనిచేస్తున్నారు అన్నది కూడా డేటా రెడీగా ఉండడంతో పనిచేస్తేనే పదవులు భవిష్యత్తు అవకాశాలు అన్నది కూడా అర్ధం అవుతోంది అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ అయితే ఐప్యాక్ కి ప్యాకప్ చెప్పేసినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News