ఎన్జీవోల మీటింగ్ లో జగన్...ఫోకస్ అటే మరి...?

ఏపీ ఎన్జీవోలు జగన్ వరాలు ప్రకటిస్తున్నారా. సీఎం హోదాలో జగన్ ఫస్ట్ టైం ఏపీ ఎన్జీవోల రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటున్నారు.;

Update: 2023-08-21 03:21 GMT

ఏపీ ఎన్జీవోలు జగన్ వరాలు ప్రకటిస్తున్నారా. సీఎం హోదాలో జగన్ ఫస్ట్ టైం ఏపీ ఎన్జీవోల రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటున్నారు. విజయవాడలో జరిగే ఈ సమావేశంలో జగన్ ముఖ్య అతిధిగా హాజరై కీలక సందేశం ఇస్తారు.

ఏపీలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకంగా ఉంది. లక్షలలో వారు ఉద్యోగాల్లో ఉన్నారు. వారి కుటుంబీకులతో కలుపుకుంటే అతి పెద్ద సెక్షన్ గా ఉంటారు. 2019 ఎన్నికల్లో ఏపీ ఎన్జీవోలు వైసీపీకి మద్దతుగా నిలిచి భారీ మెజారిటీ దక్కడానికి కారణం అయ్యారు. ఆ తరువాత ఓపీఎస్ కోసం వారు పోరాట బాట పట్టారు. అలాగే వేతన సవరణ ఒప్పందాల విషయంలో కొంత అసంతృప్తికి లోను అయ్యారు.

ఇక వారి విషయంలో ప్రభుత్వం అయితే చేయాల్సినవి చేశామని అంటోంటి. ఓల్డ్ పెన్షన్ స్కీం ని అమలు చేయలేము కానీ ఇంచుమించు సరిసాటిగా జీపీఎస్ ని అమలు చేస్తామని ప్రకటించింది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఏపీ ఎన్జీవోలను మంచి చేసుకోవడం ఒక రాజకీయ పార్టీగా వైసీపీ మీద ఉంది. అదే సమయంలో తమ డిమాండ్ల సాధనకు ఇదే సరైన సమయం అని ఎన్జీవోలు భావిస్తున్నారు. అందుకే సీఎం ని తమ కౌన్సిల్ మీటింగ్ కి ఆహ్వానించారు. అయితే ఇది ఆనవాయితీగా వస్తున్నదే అని ఏపీ ఎన్జీవోలు అంటున్నారు.

గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఎన్జీవో మీటింగ్స్ కి అటెండ్ అయ్యారని అంటున్నారు. కానీ మరో ఏడెనిమిది నెలలలో ఎన్నికల సీజన్ ఉంది. ఎన్జీవోలకు డిమాండ్లు ఉన్నాయి. దాంతో ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న జగన్ ఏమి మాట్లాడుతారు అన్న చర్చకు తెర లేస్తోంది.

ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి వరాలు ఇస్తారా అన్న ప్రచారం కూడా ఉంది. ఏపీ ప్రభుత్వానికి అతి ముఖ్యమైన యంత్రాంగంగా ఉన్న ఎన్జీవోలకు ప్రభుత్వం భారీ వరాలే ఇస్తుంది అని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి సైతం ఓపీఎస్ తప్ప మిగిలిన డిమాండ్లు ఏమైనా ఉంటే వాటిని సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీకి మద్దతుగా ఎన్జీవోలను తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ చూస్తున్న వేళ ముఖ్యమంత్రి ఏమి మాట్లాడుతారు అన్నది అన్ని వైపుల నుంచి ఆసక్తిని పెంచుతోంది. అయితే వాస్తవ దృక్పధంతో ఆలోచించే జగన్ ఏపీ ఎన్జీవోలను తమ ఫ్యామిలీగా భావిస్తారని, అదే టైంలో ప్రభుత్వం చేయగలిగే వాటినే చెబుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు వేడెక్కిన వేళ ఎన్నికల వాతావరణం అన్ని వైపులా పరచుకున్న వేళ ఈ మీటింగ్ మాత్రం చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోది.

Tags:    

Similar News