మహిళలకు నిజంగానే అన్యాయం జరిగిందా? వాస్తవం ఏంటి?
అయితే.. వాస్తవానికి మహిళలకు నిజంగానే అన్యాయం జరిగిందా? బీజేపీ చెబుతున్న విషయం కరెక్టేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.;
పార్లమెంటు సమావేశాల్లో తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయిందని.. దీనికి ప్రతిపక్షాలే కారణమని.. దేశంలోని మహిళలంతా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిని తిప్పికొట్టాలని బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం పొద్దు పొద్దున్నే దేశవ్యాప్తంగా ఈ విషయంపై నిరసనలు చేపట్టాలని పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు .. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
అయితే.. వాస్తవానికి మహిళలకు నిజంగానే అన్యాయం జరిగిందా? బీజేపీ చెబుతున్న విషయం కరెక్టేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి రెండు అంశాలను పరిశీలిస్తే.. వాస్తవం బోధ పడుతుంది. తద్వారా ఎవరు ఎవరికి అన్యాయం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. అంతేకాదు.. మహిళా రిజర్వేషన్ బూచిని చూపించి.. బీజేపీ పెద్దలు ఆడుతున్న నాటకం కూడా తెలిసిపోతుంది.
1) మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చిందా లేదా?: ఈ విషయంపై పెద్దగా సంశయం లేదు. ఎందుకంటే.. గురువారం రాత్రి 12 గంటల సమయంలో కేంద్ర న్యాయ శాఖ ఒక గెజిట్‌ను జారీ చేసింది. దీనిలో స్పష్టంగా.. `తక్షణం మహిళా బిల్లు అమల్లోకి వచ్చింది.` అని పేర్కొన్నారు. అంతేకాదు.. 2023 లో చేసిన మహిళా రిజర్వేషన్ చట్టం యథాతథంగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సో.. దీనిని బట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైంది. ఇప్పుడు అది అమల్లోనే ఉంది. కాబట్టి బీజేపీ వాదనలో పసలేదు.
2) విపక్షాల సహకారం: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌కు అనుబంధంగా ఆన్‌లైన్‌లో పేర్కొన్న సమాచరంలో పార్లమెంటు మినిట్స్‌ను కూడా పేర్కొన్నారు. దీనిలో ఏయే పార్టీలు.. ఎలా అనుమతి ఇచ్చాయో కూడా తెలిపారు. 2023లో ఇదే పార్లమెంటులో జరిగిన మహిళా బిల్లుపై ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓటేశాయని స్పష్టంగా ఉంది. దీనిని బట్టి.. కూడా బీజేపీ చెబుతున్న వాదన సరికాదన్న కళ్ళముందు కనిపిస్తూనే ఉంది. కాబట్టి .. మహిళలకు అన్యాయం జరిగిందన్నది అవాస్తవం.
అయితే..
అయితే.. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది.. అనేది చూస్తే.. 2034 నుంచి. అది కూడా.. కొత్తగా జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తారు. కానీ.. మోడీ సర్కారు వచ్చే ఎన్నికల నుంచి అమలు చేయాలని భావిస్తోంది. దీనిలో తప్పులేదు. కానీ, విపక్షాలు.. వాస్తవానికి 2024(గత) ఎన్నికల నుంచే అమలు చేయాలని పట్టుబట్టినా.. నాడు వినిపించుకోలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టి.. దీనిని రాజకీయంగా వాడుకోవాలన్నదే ప్రశ్న.