మోడీ బర్త్ డే...ఆ ఒక్క దేశం ఎందుకు గ్రీట్ చేయలేదు ?

ఆపరేషన్ సింధూర్ తో మోడీ పాక్ కి ఈ మధ్యనే గట్టిగా గుణపాఠం చెప్పారు కేవలం అరగంట వ్యవధి లోపే అనుకున్న లక్ష్యాల మీద గురి పెట్టి మరీ దాయాది కూసాలు కదిలించారు.;

Update: 2025-09-19 16:53 GMT

నరేంద్ర మోడీ 75వ మైలు రాయిని దాటారు. ఆయన పుట్టిన రోజు వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలెడితే ఎన్నో దేశాల అధిపతులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఒక వైపు అధిక సుంకాల విషయంలో భారత్ అమెరికాల మధ్య ప్రతిష్టంభన నడుస్తున్నా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మోడీని విష్ చేశారు. తనకు సన్నిహిత స్నేహితుడిగా అభివర్ణించారు. ఇక రష్యా, ఆస్ట్రేలియా, ఇటలీ న్యూజిలాండ్, ఇజ్రాయిల్ వంటి దేశాలకు చెందిన అధిపతులు అంతా మోడీ నాయకత్వం వర్ధిల్లాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకున్నారు. అయితే పొరుగునే ఉన్న పాక్ మాత్రం కిమ్మనలేదు. ఎందుకు ఇలా అన్నదే అంతటా చర్చగా ఉంది.

ఆపరేషన్ డోస్ ప్రభావం :

ఆపరేషన్ సింధూర్ తో మోడీ పాక్ కి ఈ మధ్యనే గట్టిగా గుణపాఠం చెప్పారు కేవలం అరగంట వ్యవధి లోపే అనుకున్న లక్ష్యాల మీద గురి పెట్టి మరీ దాయాది కూసాలు కదిలించారు. అంతే కాదు మోడీ మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. సింధు నది జలాలు పాక్ కి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. నీరు రక్తం కలసి పారవని కూడా స్పష్టమైన వైఖరిని తీసుకున్నారు ఇక గత పదకొండేళ్ళుగా చూసుకుంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పాక్ కి ఎప్పటికి అపుడు తగిన తీరున భారీగా జవాబు ఇస్తోంది. మెరుపు దాడులతో పాటు అనేక రకాలుగా పాక్ ని కట్టడి చేస్తోంది. మా జోలికి వస్తే ఇలాగే ఉంటోంది అని ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తోంది.

మోడీ ఓటమి కోసం :

దీంతో ఇపుడు పాక్ కి ఒక విషయం బాగా అర్ధం అయింది అని అంటున్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటే పాక్ కి చుక్కలే అని వారు భావిస్తున్నారు. మోడీ మాటల మనిషి కాదు చేతల మనిషి అని వారు అంటున్నారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పాక్ సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్ళి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ తరువాత బాల్ కోట్ స్ట్రైక్స్ చేసింది. పహిల్గాద్ ఉగ్ర దాడి తరువాత ఆపరేషన్ సింధూర్ తో గట్టిగానే సౌండ్ చేసింది. దీనిని బట్టి పాక్ కి అర్ధం అయింది ఏంటి అంటే తాము ఒకటి అంటే భారత్ నుంచి పది రకాలుగా బదులు వస్తుందని దాంతోనే ఇపుడు పాకిస్థాన్ నేతలు కానీ క్రీడాకారులు కానీ ఆఖరుకు ఉగ్ర మూకలు కూడా ఈ విషయం ఎక్కడా దాచుకోవడం లేదు. వారు వివిధ సందర్భాలలో తమ మనసులోని మాటను బయటకు వెళ్ళగక్కుతున్నారు.

దౌత్య సంబంధాల నెపంతో :

భారత్ పాక్ దౌత్య సంబంధాలు దెబ్బ తింటున్నాయని ఇపుడు పాక్ కొత్త రాగాలని అందుకుంటోంది. వెనకటికి ఏదో బాగున్నట్లుగా ఇపుడే కొత్తగా చెబుతోంది. మోడీ ఉంటే మరింత బలహీనంగా ఈ రిలేషన్స్ ఉంటాయని ఆందోళన పడుతోంది. వచ్చే ఎన్నికలో మోడీ ఓడిపోవాలి అని బలంగా కోరుకుంటున్నట్లుగా పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. ఇక మాజీ విదేశాంగ మంత్రిగా ఉన్న బిలావల్ భుట్టో మాట ఇదే. పాక్ లో సిట్టింగ్ ఎంపీలు అంతా కలసి మోడీ ఓటమి కావాలని చెబుతున్నారు. ఇది ఎంతవరకూ వెళ్ళింది అంటే పాక్ మాజీ క్రీడాకారుడు షాహీద్ అఫ్రీదీ రాహుల్ గాంధీని ఎంతో పొగుడుతూ మోడీ ఉంటే బహు కష్టమని అన్నారు. అంతే కాదు పాక్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ కర్ మాట్లాడుతూ మోడీ హయాంలో పాక్ మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇపుడు చూస్తే కొత్త సంప్రదాయంగా పాక్ ఉగ్రవాదులు వీడియో బైట్స్ పంపిస్తున్నారు. మోడీకే నేరుగా వారు వార్నింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఊసినపుడు మోడీ భారత ప్రధానిగా ఉంటే తమకు ఇంతే సంగతులు అని వారికి బాగా అర్థం అయింది. మోడీ పాక్ విషయంలో డీల్ చేస్తున్న విధానం గతానికి భిన్నమైనది కఠినమైంది, పాక్ కి ఏ మాత్రం మింగుడు పడనిదిగా ఉంది. అందుకే మోడీకి బర్త్ డే విషెస్ చేయడానికి కూడా వారిని మనసు రాలేదని అంటున్నారు.

Tags:    

Similar News