• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విశాఖలో సిద్ధమైన ఐటీ...

విశాఖలో సిద్ధమైన ఐటీ ఐకానిక్ భవనం.. కొత్త కంపెనీలకు రెడ్ కార్పెట్ స్వాగతం

| ఇప్పుడు అదనంగా మరో భవనాన్ని అందుబాటులోకి తెస్తోంది. నగరం నడిబొడ్డున 11 బహుళ అంతస్తుల్లో భవనాన్ని సిద్ధం చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-01-24 09:30 GMT

విశాఖలో ఐటీ రంగానికి ఆతిథ్యమిచ్చేందుకు కొత్త భవనాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే తక్షణం తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన వసతులు కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో గతంలో మిలీనియం టవర్ నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు అదనంగా మరో భవనాన్ని అందుబాటులోకి తెస్తోంది. నగరం నడిబొడ్డున 11 బహుళ అంతస్తుల్లో భవనాన్ని సిద్ధం చేస్తోంది.

విశాఖకు తరలివస్తున్న ఐటీ కంపెనీలకు వసతుల సమకూర్చడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఐటీ ఇండస్ట్రీ కోసం చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా గూగుల్, టీసీఎస్ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ కార్యకలాపాలు స్టార్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటితోపాటు దావోస్ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న డేటా సెంటర్లు, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ కేంద్రాలు, చిప్ తయారీ సంస్థలు విశాఖలో ఏర్పాటు కానున్నాయి. అయితే వీటికి తగిన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో విశాఖలో వీఎంఆర్డీఏ నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని రెడీ చేసింది. వచ్చేనెలలో ఈ భవనం ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది.

సుమారు 1.72 ఎకరాల్లో రూ.87.50 కోట్లతో నగరం నడిబొడ్డున వీఎంఆర్డీఏ భవనాన్ని నిర్మిస్తున్నారు. నౌక ఆకారంలో ఉండే ఈ భవనంలో మొత్తం 11 అంతస్తులు ఉన్నాయి. ఇందులో ఆరు అంతస్తులను కార్యాలయాల నిర్వహణకు అనుగుణంగా తయారుచేస్తే, మిగిలిన ఐదు అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం 430 కార్లు, అంతే సంఖ్యలో దిచక్రవాహనాలు ఇక్కడ పార్క్ చేయొచ్చు. మొత్తం 1.65 లక్షల చదరపు అడుగుల వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కనీసం నాలుగు వేల మంది పనిచేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

గ్లోబల్ కేపబులిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు వీలుగా ఈ ఐకానిక్ భవనం ఉండటంతో ఎంఎన్సీలకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఉండే ఈ భవనంలో ఐటీ కంపెనీ ప్రారంభమైతే ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో 10 వేల ఉద్యోగాలు కల్పించే డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తామని టీసీఎస్ ముందుకొచ్చింది. అదేవిధంగా అదానీ డేటా సెంటర్, గూగుల్ సెంటర్ ఇలా ప్రతిష్ఠాత్మక సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలకు రెడీగా ఉండటంతో ఈ భవనాన్ని ఎవరికి కేటాయిస్తారన్న ఆసక్తి ఉత్కంఠకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఈ ఐకానిక్ భవనంపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

Tags:    
  • Visakhapatnam 
  • ITHub 
  • GovernmentInitiatives 
  • ITIndustry 
  • ChandrababuNaidu 
  • Naralokesh 
  • NewITBuilding 
  • VisakhapatnamDevelopment 
  • TechCompanies 
  • Andhrapradesh 
  • Appolitics 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS