పవన్ పై నారాయణ మరదలి వీడియో... విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

తాను పవన్ కళ్యాణ్ అభిమాని ని అని.. తన పరిస్థితి ఇది అని చెబుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని..

Update: 2023-08-02 06:06 GMT

గతకొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన విషయాల్లో మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత నారాయణ పై ఆయన సోదరుడి భార్య చేస్తోన్న ఆరోపణల సంగతి ఒకటి అనేది తెలిసిన విషయమే. ఈ విషయం లో ఆమె విడుదల చేస్తోన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ విషయం పై సాయిరెడ్డి మరోసారి స్పందించారు.

అవును... నారాయణ పై ఆయన సోదరుడి భార్య ప్రియ ఆన్ లైన్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె మొదటి వీడియో బయట కు వచ్చినప్పటినుంచీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. నారాయణ ను వెంటాడుతున్నారు! వరుసపెట్టి ట్వీట్లు పెడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు!

ఈ క్రమంలో తాజాగా... ప్రియ మాట్లాడిన ఒక వీడియోని పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి. ఆ వీడియోలో... తాను పవన్ కళ్యాణ్ అభిమాని ని అని.. తన పరిస్థితి ఇది అని చెబుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని.. తనకు ఇంత అన్యాయం జరిగితే పవన్ ఎందుకు నోరెత్తటం లేదని ఆమె ప్రశ్నించారు.

ఇదే సమయంళో... పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యకపోతే మా కులం నుండే బహిష్కరిస్తానని అందరికీ చెప్పానని.. పవన్ కళ్యాణ్ పై తనకు అంతటి అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ని కూడా ఇప్పుడు అనుమానించవలసి వస్తుందని.. ఆమె పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.

Read more!

దీంతో ఈ వీడియోని షేర్ చేసిన విజయసాయిరెడ్డి... "ఒక పక్క క్యాన్సర్ ప్రాణాల ను తోడేస్తున్నా తన పై జరిగిన అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టిన మీ సోదరుడి భార్యకు మతిస్థిమితం లేదని అనడానికి మనసెలా వచ్చింది నారాయణా. గుండెల ను పిండేసే వ్యథ కనిపిస్తోంది ఆమె మాటల్లో. తను "నార్కోఅనాలిసిస్" పరీక్షకు సిద్ధమని ప్రకటించింది. మీరు కూడా అందుకు రెడీ అయితే వాస్తవమేమిటో తేలిపోతుంది కదా!" అని ట్వీట్ చేశారు.

కాగా... ఇదే విషయం పై "ఇంటిగుట్టు ఎప్పుడు బయటపడ్డా ఒక మెంటల్ సర్టిఫికెట్ తో రెడీగా ఉంటుంది టీడీపీ. అసలు మీ పార్టీకే మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. మరదలు సంగతి సరే కన్నతల్లే చెప్పారుగా. ఆమెపైనా ముద్ర వేస్తారా నారాయణ!నారాయణ! నారాయణ!" అంటూ మరో వీడియోపైనా సాయిరెడ్డి స్పందించారు!

ఇదే సమాయం లో... "లైంగిక వేధింపుల కు గురైన నటీమణులు, విద్యావంతులైన మహిళలు "మీ టూ" పేరుతో ఉద్యమం చేస్తే.. సెన్షేషనల్ కథనాలు ప్రచురించి, ప్రసారం చేసిన ఒక వర్గం మీడియా... నారాయణ సోదరుడి భార్య తన పై జరుగుతున్న వేధింపుల గురించి బాహాటంగా చెబుతుంటే కళ్లు, చెవులు, నోరు మూసుకుంది. బలహీనుల పక్షాన నిలబడాల్సిన మీడియా టీడీపీ నేతకు కొమ్ము కాస్తోందని ప్రజల కు వెయ్యోసారి అర్థమైంది" అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

4

దీంతో... గ్యాప్ లేకుండా నారాయణ ను వాయించివదులుతున్నారు విజయసాయిరెడ్డి అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా... ఈ విషయం పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. "ఏమో సార్ మాకు వినబడదు" అన్నట్లుగా ఒక వర్గం మీడియా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు రావడం గమనార్హం.

Tags:    

Similar News